Nandyal District: కొడుకు, కోడలు, మనవరాలిని కిడ్నాప్ చేయించిన కసాయి.. సుపారీ ఇచ్చి మరీ చిత్రహింసలు

Nandyal District: ఐదేళ్ల చిన్నారి మెడపై కూడా కిడ్నాపర్లు కత్తి పెట్టి రెచ్చిపోయారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపుతోంది.

Nandyal District: కొడుకు, కోడలు, మనవరాలిని కిడ్నాప్ చేయించిన కసాయి.. సుపారీ ఇచ్చి మరీ చిత్రహింసలు

ప్రతీకాత్మక చిత్రం

Updated On : April 22, 2023 / 3:55 PM IST

Nandyal District: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా, డోన్ లో సుపారీ కలకలం చెలరేగింది. ఆస్తి కోసం కొడుకుని చంపాలని నిరంజన్ అనే ఓ తండ్రి ప్లాన్ వేసుకున్నాడు. సుపారీ ఇచ్చి కుమారుడు వినోద్, కోడలు స్రవంతి, మనవరాలు దీక్షితలను కిడ్నాప్ చేయించాడు. రెండు కార్లలో వినోద్, అతడి భార్య, కూతురిని కిడ్నాప్ చేశారు.

ఐదేళ్ల చిన్నారి దీక్షితను కూడా వదలకుండా ఆమె గొంతుపై కత్తి పెట్టారు కిడ్నాపర్లు. వినోద్ ను చిత్రహింసలు పెట్టి సంతకాలు పెట్టించుకున్నారు. చంపుతామని బెదిరిస్తూ… ఆస్తికి, తమకు ఏ సంబంధమూ లేదంటూ వినోద్ నుంచి సంతకాలు చేయించుకున్నారు కిడ్నాపర్లు. కొన్ని ఏళ్ల క్రితం వినోద్ కులాంతర వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి వినోద్ కు తండ్రి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు స్పందించడం లేదని ఎస్పీని ఆశ్రయించారు. కిరణ్, ప్రసాద్, సూర్య తేజ అనే ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వినోద్ తండ్రి నిరంజన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. డోన్ లో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపుతోంది. నిరంజన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.

Andhra Pradesh : మంత్రి సురేష్‍ను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసింది అందుకే అలా చేశారు : నక్కా ఆనందబాబు