Nara Lokesh: ఒకవేళ యాత్ర-2లో జగన్ నటిస్తే ఆ సినిమా..: లోకేశ్
సీఎం జగన్ ఎన్నికల ముందు ఎన్నో నాటకాలు ఆడారని, ఎంతో నటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు.

Nara lokesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సాలూరులో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎన్నికల ముందు ఎన్నో నాటకాలు ఆడారని, ఎంతో నటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు.
ఒకవేళ యాత్ర-2లో జగన్ నటిస్తే ఆ సినిమా హిట్ అయ్యేదేమో అంటూ లోకేశ్ చురకలంటించారు. జగన్‌కు సినిమాల పిచ్చి చాలా ఎక్కువ అని అన్నారు. తమ సినిమా తీసే నిర్మాతలకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారని తెలిపారు.
సాలూరులో ఇండోర్ స్టేడియం కడతామని జగన్ మాటిచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోలేదని లోకేశ్ చెప్పారు. వైసీపీ నేతలను ఎంపీలుగా గెలిపించుకుంటే ప్రత్యేకహోదా సాధిస్తామని జగన్ చెప్పారని గుర్తుచేశారు.
ఏనాడూ ఆయన ప్రత్యేక హోదా గురించి అడగలేదని లోకేశ్ అన్నారు. బీసీలకు కూడా జగన్ అన్యాయం చేశారని లోకేశ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్నెముక విరగ్గొట్టాలని అన్నారు. జగన్ కుంభకోణాలన్నింటిలో విజయసాయిరెడ్డి ఏ-2గా ఉన్నారని లోకేశ్ అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర తుస్సుమందంటూ చురకలంటించారు.
BJLP Leader: బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ చీఫ్ విప్‌గా పాల్వాయి హరీశ్