Nara Lokesh: అందుకే ఢిల్లీకి వచ్చాను: నారా లోకేశ్
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని అంటున్న వారు దాన్ని నిరూపించలేకపోయారని అన్నారు.

Nara lokesh
Nara Lokesh – Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పరులైన పాలకులంతా కలిసి నీతిపరులను జైలుకు పంపుతున్నారని, స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి స్కామ్ జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించిందని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేశ్ తాను అక్కడకు ఎందుకు వచ్చానన్న విషయాన్ని కూడా వెల్లడించారు.
చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని గురించి అందరికీ వివరించి చెప్పేందుకే తాను ఢిల్లీకి వచ్చినట్లు లోకేశ్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని అంటున్న వారు దాన్ని నిరూపించలేకపోయారని అన్నారు. ఆ ప్రాజెక్టు విషయంలో స్కామ్ జరగలేదని తాను నిరూపించగలనని తెలిపారు.
విజయవాడలో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్న తీరు సరికాదని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వారు శాంతియుతంగా ఆందోళన చేయాలనుకుంటే పోలీసులు అలా ప్రవర్తించడం ఏంటని నిలదీశారు.
టీడీపీ వెబ్‌సైట్..
కాగా, స్కిల్‍డెవలప్‍మెంట్ పై వాస్తవాలతో.. అంటూ టీడీపీ https://apskilldevelopmenttruth.com అనే వెబ్‍సైట్ ఆవిష్కరించింది. ఈ వెబ్ సైట్ ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు.
స్కిల్‍డెవలప్‍మెంట్ వాస్తవాలతో టీడీపీ https://t.co/Xq6sQGk3Z3 అనే వెబ్సైట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వెబ్ సైట్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు.#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/DEAuQtjR6E
— Telugu Desam Party (@JaiTDP) September 15, 2023
Kishan Reddy: తెలంగాణలో ఆ పని చేసే అధికారం కాంగ్రెస్‌కు లేదు: కిషన్ రెడ్డి