Nara Lokesh: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకుని.. లోకేశ్ సెల్ఫీ.. ఎక్కడంటే?

శివార్లలో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి అని లోకేశ్ అన్నారు.

Nara Lokesh: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకుని.. లోకేశ్ సెల్ఫీ.. ఎక్కడంటే?

Nara Lokesh

Updated On : August 10, 2023 / 7:26 PM IST

Nara Lokesh – Sand Mafia: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకుని టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. ట్విట్టర్‌లో దీనిపై వివరాలు తెలిపారు.

” బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు. రాష్ట్రంలో వైసీపీ ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి.

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ మాఫియాలు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయి. జలగన్న పాలనలో అంబేద్కర్ రాజ్యంగం, చట్టాలకు విలువలేదు. వైసీపీ దొంగలకు తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయడమే అని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ఆ ప్రాంతంలో పర్యటించారు.

కాగా, వైసీపీ కార్యకర్తలు లేరని, ఉన్నదల్లా వీధి రౌడీలేనని లోకేశ్ విమర్శించారు. ” ఆ వీధి రౌడీల చేతి కింద పోలీస్ వ్యవస్థను పెట్టాడు ఈ సైకో జగన్. జైల్లో ఉండాల్సిన వైసీపీ దొంగలు, రౌడీలు, సైకోలు పోలీసులను వాడుకుంటున్నారు. ఒక రకంగా పోలీసులను బలి తీసుకుంటున్నారు.

తెలుగుదేశం కార్యకర్తలం మా అంతట మేము ఎవరి జోలికి వెళ్లం. అలాగని మా నాయకుడు చంద్రబాబు గారి మీద ఈగ వాలినా సరే మేము ఊరుకోము. మా పార్టీ అధినేతను కాపాడుకోవడం కార్యకర్తలుగా మా బాధ్యత. ఈ విషయంలో మమ్మల్ని చంద్రబాబు గారు ఆగమన్నా ఆగేది లేదు ” అని లోకేశ్ అన్నారు.

Ambati Rambabu: అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు.. అంటూ మంత్రి అంబటి సంచలన కామెంట్స్