Nara Lokesh: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి వాదనలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Nara Lokesh
Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఆగిన లోకేశ్ పాదయాత్రను తిరిగి శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ఆ పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే.
దీని ద్వారా వైసీపీ ప్రభుత్వ చర్యలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే, సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి వాదనలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని లోకేశ్ టీడీపీ ముఖ్య నేతలు కోరారు. దీంతో వారి అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్.. అందుకు అంగీకరించారు.
తన పాదయాత్ర పున:ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సర్కారు కక్ష సాధింపుతో కేసులు తెరపైకి తెచ్చి చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పెడుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. లోకేశ్ ఢిల్లీలో అడ్వకేట్లతో సంప్రదింపులు కొనసాగించడం చాలా అవసరమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఏపీలో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర టీడీపీకి చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా ఈ పాదయాత్రను ప్రారంభిస్తే బాగుంటుందని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Madan Reddy : నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది : ఎమ్మెల్యే మదన్ రెడ్డి