చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం

టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ యాప్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ లు పంపించుకోవచ్చు. దీని ద్వారా వస్తువులు కొనుగోలు తమ సరదాలు తీర్చుకున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం ఓబుల్‌రెడ్డిగారిపల్లెకు చెందిన అఖిల్(23), పృథ్వి(19), పుంగనూరు మండలం బోడేవారిపల్లె వాసి భరత్‌కుమార్(19), పీఅండ్‌టీ కాలనీకి చెందిన హరీష్(22), దిగువ కురవంక వాసి అజయ్‌కుమార్(22), కురవంకకు చెందిన సాయిచరణ్(22), వికాస్(21), చౌడేపల్లె మండలం అప్పినపల్లె వాసి ఎం.చిరంజీవి(22), గురికాయలకొత్తూరుకు చెందిన చిన్నారెడ్డి(22), మరో యువతి కలిసి బృందంగా ఏర్పడ్డారు. విలాసాలకు అలవాటు పడిన వీరంతా డింగ్‌టోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
తమ సరదాలు తీర్చుకోటానికి మదనపల్లెలోని ఆరుగురు వ్యాపారుల నుంచి సెల్ ఫోన్ లు, బట్టలు, బేకరీ నుంచి ఫుట్ ఐటెమ్స్ కొనుగోలు చేశారు. వాటికి డబ్బులు చెల్లించేందుకు … ఫోన్‌పేలో డబ్బు వేసినట్లు డింగ్‌టోన్ యాప్ ద్వారా నకిలీ మెసేజ్‌లను వ్యాపారుల సెల్ ఫోన్లకు పంపించారు. వారు పంపించినప్పుడు వచ్చినట్లు తెలిసేది. ఖాతాలో చూసుకుంటే నగదు జమ కాకపోయే సరికి బాధితులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేసి 9మందిని మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 8 సెల్ ఫోన్ లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ఫేస్‌బుక్ ద్వారా కూడా మోసాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండేవారిని బోల్తా కొట్టించేందుకు అమ్మాయిల పేరిట నకిలీ ఖాతాలు తెరచి… యువకులు, వ్యాపారుల నుంచీ వీరు డబ్బు దోచుకుంటున్నారని ఆయన తెలిపారు.
Read:16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి సోకిన కరోనా