husband sworn in instead of wife : భార్య సర్పంచ్…భర్తతో ప్రమాణస్వీకారం
కర్నూలు జిల్లాలో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వింత చోటు చేసుకుంది. భార్య సర్పంచ్ అయితే భర్తతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Husband Sworn In Instead Of Wife
husband sworn in instead of wife : కర్నూలు జిల్లాలో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వింత చోటు చేసుకుంది. భార్య సర్పంచ్ అయితే భర్తతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కౌతాళం మండలం చూడి గ్రామంలో లక్ష్మి అనే మహిళ సర్పంచ్ గా గెలిచారు. అనారోగ్యంతో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోయింది. దీంతో ఆమె భర్త ఉప్లప్పతో పంచాయతీ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
విషయం తెలుసుకున్న ఎంపీడీవో సూర్యనారాయణ సంబంధిత పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేశారు. సర్పంచ్ లక్ష్మి ఆరోగ్యం కుదుటపడ్డాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాణస్వీకారం చేయిస్తామని తెలిపారు.
కాగా, భార్యను కాకుండా భర్తతో ప్రమాణస్వీకారం చేయించడం పట్ల పలువురు విమర్శలు చేశారు. గ్రామస్తులు అధికారుల తీరుపై మండిపడ్డారు.