Omicron Case In Tirupati : తిరుపతిలో ఒమిక్రాన్ కేసు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది.

Omicron Case In Tirupati : తిరుపతిలో ఒమిక్రాన్ కేసు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Omicron Case In Tirupati

Updated On : December 12, 2021 / 7:22 PM IST

Omicron Case In Tirupati : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. విజయనగరంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా, తిరుపతిలోనూ 34 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, అతడు బ్రిటన్ నుంచి వచ్చాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి(డీఎంహెచ్ఓ) శ్రీహరి స్పందించారు.

తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు వస్తున్న వదంతులను నమ్మొద్దని డీహెచ్ఎంఓ శ్రీహరి తెలిపారు. తిరుపతిలో నమోదైంది కరోనా పాజిటివ్ కేసు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని, ఒమిక్రాన్ అని ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.

Elderly Couple Sells Poha : హ్యాట్సాఫ్.. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీద ఆధారపడకుండా పోహా అమ్మి జీవనం

కాగా, భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరం కొనసాగుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్(విజయనగరం), పంజాబ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. మరో రెండు కేసులు మహారాష్ట్ర, కర్నాటకలో వెలుగుచూశాయి. ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 18 మందికి ఈ కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 37కి పెరిగింది.

Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

దేశంలో కొత్త‌గా 7వేల 774 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. మరో 306 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 8వేల 464 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో మొత్తం 92వేల 281 మందికి చికిత్స అందుతోంది. దేశంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,75,434కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,22,795 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 132,93,84,230 వ్యాక్సిన్ డోసులు వేశారు.