బీజేపీకి షాక్ : NRC బిల్లుకు వ్యతిరేకం – సీఎం జగన్ ప్రకటన

  • Published By: madhu ,Published On : December 23, 2019 / 11:44 AM IST
బీజేపీకి షాక్ : NRC బిల్లుకు వ్యతిరేకం – సీఎం జగన్ ప్రకటన

Updated On : December 23, 2019 / 11:44 AM IST

NRC బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం కడప జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ…

మైనార్టీ లీడర్, డిప్యూటీ సీఎం ఇదివరకే చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు చేయదని చెప్పడం జరిగిందని విషయాన్ని గుర్తు చేశారు. తనతో డిస్కషన్ చేసిన తర్వాతే..ఆ ప్రకటన చేశారని వివరించారు. ఎట్లాంటి పరిస్థితుల్లో తాము సపోర్టు ఇవ్వమని హామీనిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. దీంతో ముస్లిం వర్గాలు సంతోషం వ్యక్తం చేశారు. 

 

దేశ వ్యాప్తంగా CAA, NRC వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇటీవలే MIM ఎంపీ ఓవైసీ సీఏఏ, ఎన్ఆర్ సీపై స్పందించారు. స్నేహితుడైన సీఎం జగన్ ‌సాబ్‌ను ఒకటి కోరుతున్నా..కేంద్రానికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించండి..దేశాన్ని కాపాడాలి అంటూ AIMIM అధినేత, ఎంపీ ఓవైసీ సూచించారు.

ఇప్పటికే పలు పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ సీ చట్టం తీసుకరావడానికి అంటే..జాతీయ పౌర రిజిస్టర్ బిల్లుకు ప్రయత్నిస్తే..తాము సహకరించబోమని బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. కీలక మిత్రపక్షం బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఇదే వైఖరితో ఉన్నారు.

అకాళీదల్ కూడా విముఖత తెలిపింది. రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్ జేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అసోం గణపరిషత్ ఇప్పటికే వ్యతిరేకత ప్రకటించింది. తాజాగా వైసీపీ కూడా నో చెప్పడంతో రాజ్యసభలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 
 

Read More : రాజధానిలో బాబు : GN RAO కమిటీ అంటే..జగన్ మోహన్ రెడ్డి కమిటీ