Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కుట్ర.. జనసేన హెచ్చరిక.. డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళా కార్యకర్తల్ని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వీర మహిళలు ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డుపెట్టారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కుట్ర.. జనసేన హెచ్చరిక.. డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan (@JSPVeeraMahila)

Updated On : July 7, 2023 / 4:53 PM IST

Pawan Kalyan – JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాల పట్ల ఆ పార్టీ హెచ్చరికలు చేసింది. తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై తాము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన చేసింది. పవన్ పై కుట్ర పూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోన్న వారిలో ప్రధానంగా వైసీపీ (YSRCP)కి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పింది.

వారితో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెళ్లు, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నామని వివరించింది. ఈ మేరకు జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. తప్పుడు ప్రచారం చేస్తోన్న పలు అకౌంట్ల వివరాలు కూడా జనసేన పేర్కొంది.

మరోవైపు, పవన్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయానికి జనసేన వీర మహిళలు ర్యాలీగా వెళ్లబోయారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళా కార్యకర్తల్ని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు.

వీర మహిళలు ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డంపెట్టారు. తమను పోలీసులు అడ్డుకున్న తీరుపై జనసేన కార్యకర్తలు, వీర మహిళలు మండిపడ్డారు. ఏపీలో మహిళలకు భద్రత లేదంటూ నినాదాలు చేశారు. కాగా, పవన్ కల్యాణ్ తన మూడో భార్యతోనూ విడిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు విపరీతంగా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను దెబ్బ తీసేందుకే ఇటువంటి పోస్టులు చేస్తున్నారని జనసేన మండిపడుతోంది.

Pawan kalyan : మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలాఖాలో పవన్ కల్యాణ్ .. నేతలతో చర్చలు