Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త సిగ్నేచర్ చూశారా..? డిప్యూటీ సీఎం అయ్యాక సంతకం మార్చిన పవన్..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంతకం వైరల్ అవుతుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త సిగ్నేచర్ చూశారా..? డిప్యూటీ సీఎం అయ్యాక సంతకం మార్చిన పవన్..?

Pawan Kalyan News Signature going Viral is he Changed Signature after Taking Charge as Deputy CM

Updated On : June 20, 2024 / 1:25 PM IST

Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించి తన జనసేనతో పాటు టీడీపీ – బీజేపీతో కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏపీ ఉపముఖ్యమంత్రితో పాటు మంత్రిగా కూడా పలు శాఖలు కేటాయించారు. నిన్నే పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read : Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఏమని పోస్ట్ చేశారంటే..

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంతకం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు పెట్టగా వీడియోలో వాటిని క్లోజ్ గా చూపించారు. దీంతో పవన్ కళ్యాణ్ సంతకం వైరల్ అవుతుంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అని ఇంగ్లీష్ లో మొత్తం పేరు కలిపి సంతకం పెట్టేవారు. తాజాగా పెట్టిన సంతకంతో మాత్రం కేవలం PK అని రెండు అక్షరాలే కలిపి రాశారు. దీంతో ఈ విషయం చర్చగా మారింది.

Pawan Kalyan News Signature going Viral is he Changed Signature after Taking Charge as Deputy CM

Pawan Kalyan News Signature going Viral is he Changed Signature after Taking Charge as Deputy CM

జనసేన పవన్ కళ్యాణ్ పేరిట విడుదల చేసే అన్ని లెటర్స్ పై పవన్ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ అని ఫుల్ పేరు కలిపి ఉంటుంది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక కేవలం PK అని రెండు అక్షరాలు మాత్రమే పెట్టడంతో సంతకం మార్చారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ అని తెలుగులో కూడా సిగ్నేచర్ పెడతారు పవన్. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొత్త సిగ్నేచర్ మాత్రం వైరల్ గా మారింది.