Pawan Varahi Yatra: కూటమిపై నిర్ణయం తీసుకోలేదు.. మొత్తం రాజకీయం ఆంధ్రప్రదేశ్ నుంచే: పవన్.. Live Updates

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర ప్రారంభమైంది.

Pawan Varahi Yatra: కూటమిపై నిర్ణయం తీసుకోలేదు.. మొత్తం రాజకీయం ఆంధ్రప్రదేశ్ నుంచే: పవన్.. Live Updates

Pawan Kalyan Varahi Yatra

Updated On : June 14, 2023 / 8:39 PM IST

Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ జూన్ 23 వరకు ఖరారైంది. పది రోజులు తొమ్మిది నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 Jun 2023 08:24 PM (IST)

    కూటమిపై నిర్ణయం తీసుకోలేదు: పవన్

    మొత్తం రాజకీయం ఆంధ్రప్రదేశ్ నుంచే చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చేయి అని కొందరు అంటున్నారని చెప్పారు. ఒక్కడిగా వస్తానా? కూటమిగా వస్తానా? ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. కచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తామని అన్నారు.

  • 14 Jun 2023 07:28 PM (IST)

    సాధారణ విషయం కాదు..

    పార్టీని పదేళ్లపాటు నడపడం సాధారణ విషయం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరంలో ఆయన ప్రసంగిస్తున్నారు. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అంత సులువు కాదని చెప్పారు.

  • 14 Jun 2023 06:57 PM (IST)

    వారాహి విజయ యాత్రలో అపశ్రుతి

    వారాహి విజయ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రీషియన్ స్తంభంపై స్వల్ప విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం తేరుకుని, స్వయంగా కిందికి దిగి వచ్చాడు.

  • 14 Jun 2023 06:51 PM (IST)

    కత్తిపూడికి పవన్ కల్యాణ్

    భారీ జనసందోహం మధ్య పవన్ కల్యాణ్ కత్తిపూడికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కారులో ఆయన కత్తిపూడి వచ్చారు. అక్కడ ఇప్పటికే ఉంచిన వారాహిపైకి ఎక్కి ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

  • 14 Jun 2023 06:32 PM (IST)

  • 14 Jun 2023 05:49 PM (IST)

    వాహనాల రాకపోకలు నిలిపివేత

    అన్నవరం రత్నగిరి కొండపైకి వాహనాలు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి బయలుదేరే వరకు ట్రాఫిక్ దృష్ట్యా ఘాట్ రోడ్డుపై పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

  • 14 Jun 2023 04:20 PM (IST)

    బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న వారాహి

    * కత్తిపూడి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటున్న జనసేన కార్యకర్తలు

    * కాసేపట్లో అన్నవరం నుంచి కత్తిపూడికి రానున్న పవన్

    * వారాహి మీది నుంచి తొలి సారి ప్రసంగించనున్న పవన్

    * బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న వారాహి

  • 14 Jun 2023 11:05 AM (IST)

    జిల్లా నేతలతో సమావేశం..

    ఈరోజు సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి‌కి ర్యాలీ‌గా వెళ్లనున్న జనసేనాని. కత్తిపూడి వద్ద వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభ‌లో  ప్రసంగం చేయనున్న పవన్ కళ్యాణ్.

  • 14 Jun 2023 10:41 AM (IST)

    అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం తిరిగి తాను బస చేస్తున్న రామరాజు నిలయంకు చేరుకున్న పవన్.

     

  • 14 Jun 2023 10:19 AM (IST)

    వారాహి విజయ యాత్రగా నామకరణం

  • 14 Jun 2023 10:16 AM (IST)

    రామరాజు గెస్ట్ హౌస్ నుండి సత్యదేవుని దర్శనం కోసం బయలుదేరిన పవన్

  • 14 Jun 2023 10:09 AM (IST)

    కొద్దిసేపట్లో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

  • 14 Jun 2023 08:48 AM (IST)

    వారాహి రథంకు పూజలు..

  • 14 Jun 2023 08:41 AM (IST)

    ఈరోజు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుడిని దర్శించుకుంటారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడికి ర్యాలీగా వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈరోజు రాత్రికి గొల్లప్రోలు‌లో పవన్ బస చేస్తారు.

  • 14 Jun 2023 08:39 AM (IST)

    పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభమవుతుంది. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకుని జనసేన అధినేత పవన్ యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటలకు అన్నవరం నుంచి బయల్దేరి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్‌ వద్దకు పవన్ చేరుకుంటారు. యాత్రలో భాగంగా అక్కడ సభలో పవన్ ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది.

  • 14 Jun 2023 08:28 AM (IST)

    బహిరంగ సభల షెడ్యూల్

    Pawan Kalyan Varahi Yatra

    Pawan Kalyan Varahi Yatra

  • 14 Jun 2023 08:26 AM (IST)

    అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకుని ఆ తరువాత పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమవుతుంది.

  • 14 Jun 2023 08:24 AM (IST)

    జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. ఏపీలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలుత తొమ్మిది నియోజకవర్గాల్లో యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జూన్ 23వ తేదీ వరకు తొలిదశ షెడ్యూల్ ఖరారు కాగా.. 10 రోజులు తొమ్మిది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.