Payyavula Keshav: కన్న తల్లికి దండం పెట్టలేని వైఎస్ జగన్ ఇప్పుడు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతున్నారు: మంత్రి పయ్యావుల కేశవ్
ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని పయ్యావు కేశవ్ తెలిపారు.

కన్న తల్లికి దండం పెట్టలేని వైఎస్ జగన్ ఇప్పుడు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం సూచనలతో 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదల చేశామని అన్నారు.
ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని పయ్యావు కేశవ్ తెలిపారు. వచ్చిన 5 వెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో 5 శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా అని నిలదీశారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని అన్నారు.
పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు, రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. రాయలసీమ భూ భాగంలో పట్టిసీమ తర్వాత గణనీయ మార్పులు వచ్చాయని తెలిపారు. రైతు కష్టాలు తీరుస్తూ ధాన్యం కొనుగోళ్లు చేసిన 24 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని అన్నారు. అనర్హుల పేరిట ఫింఛన్ల తొలగింపు అని జరుగుతున్న ప్రచారం జగన్ శ్రేణులు సృష్టించిందేనని చెప్పారు.
మీలో ఒక్కడిగా నన్ను భావించి మీకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వండి: నారా లోకేశ్