పవన్ కళ్యాణ్ కు షాక్ : కేసు పెట్టనున్న పోలీసులు

జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 09:43 AM IST
పవన్ కళ్యాణ్ కు షాక్ : కేసు పెట్టనున్న పోలీసులు

Updated On : January 1, 2020 / 9:43 AM IST

జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.

రాజధాని గ్రామాల్లో పర్యటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. జనసేనానిపై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెబుతున్నారు. జనసేనాననిపై కేసు పెడతామన్నారు. మంగళవారం(డిసెంబర్ 31,2019) అమరావతి ప్రాంతంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. మందడం వెళ్లేందుకు పవన్ ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతించ లేదు. సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున.. పవన్ మందడానికి వెళ్లేందుకు.. పోలీసులు నిరాకరించారు. తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు సూచించారు. అయినా వినని పవన్.. కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్లారు.

మందడం వైపు నడుచుకుని వెళ్తున్న పవన్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పావు గంట పాదయాత్ర ఆపాలని పవన్‌ను కోరారు. దీంతో వెంకటాపాలెం దగ్గర రోడ్డుపై పవన్ బైఠాయించారు. మరోసారి మందడం శివార్లలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. పవన్ తో పాటు జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఆ తర్వాత కాలినకడన రాజధాని గ్రామాల్లో పర్యటించారు పవన్. అయితే పవన్ తీరుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించడాన్ని తప్పుపడుతున్నారు. పవన్ పై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని మార్పు నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. అమరావతి రాజధానిగా నాడు అంగీకారం తెలిపిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చడం కరెక్ట్ కాదన్నారు. రైతులు తమ భూములు ఇచ్చింది వ్యక్తికి కాదని ప్రభుత్వానికని గుర్తు చేశారు. రైతులతో కన్నీరు పెట్టించడం పాలకులకు మంచిది కాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడం సమంజసం కాదన్నారు.

Also Read : రాజధాని రైతుల ఉద్యమానికి నారా భూవనేశ్వరి విరాళం

Also Read : మీ ఇడుపులపాయ ఎస్టేట్ బాగుండాలి.. కానీ రైతులు మాత్రం బాగుండకూడదా : పవన్ కళ్యాణ్