Perni Nani: విచారణకు రండి.. పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..

రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోలీసులు ఇచ్చారు.

Perni Nani: విచారణకు రండి.. పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..

perni nani and Perni Jayasudha (Gool Image)

Updated On : January 1, 2025 / 12:48 PM IST

PDS Rice Case: మచిలీపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వచ్చేశారు.

Also Read: Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట..

మచిలిపట్నం ప్రైవేట్‌ గోదాం నుంచి రేషన్‌ బియ్యం మాయం కేసులో పోలీసులు ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. అందులో ఏ1గా పేర్ని నాని సతీమణి జయసుధకాగా.. ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు. అయితే, ఈ కేసులో పేర్ని నాని, జయసుధ మినహా మిగిలిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.

Also Read: Perninani Case: పేర్నినాని గోడౌన్‌ కేసులో నలుగురు అరెస్ట్.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి..

ఇదిలాఉంటే.. పేర్ని నాని పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేశాడు. పిటిషన్ విచారించిన కోర్టు.. వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిని అరెస్టు చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.