KA Paul : స్టీల్ ప్లాంట్ భూములను అదానీకి ఇచ్చేయాలని చూస్తున్నారు.. చంద్రబాబుపై అక్కసుతోనే అమరావతి నాశనం ..
తెలంగాణాలో డిసెంబర్‌లో, ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేగా, ఏపీలో ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్ చెప్పారు.

KA Paul
Prajashanti Party President KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు బీజేపీ (BJP) కి తొత్తులుగా మారిపోయారంటూ పాల్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ భూములను అదానీకి ఇచ్చేయాలని చూస్తున్నారు. గంగవరం పోర్టును ఇచ్చేశారంటూ పాల్ ఆరోపించారు. మోదీ ఇంటి ముందు స్టీల్ ప్లాంట్‌కోసం మూడు రోజులు నిరాహార దీక్షకు పిలుపునిస్తే.. ఏపీలోని ఏ రాజకీయ పార్టీ గాని, నాయకులుగానీ ఎవ్వరూరాలేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ఇప్పటికైనా స్పందించి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగంలోనే వుంచాలని కోరారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 20వేల ఎకరాలకుగాను, 10వేల ఎకరాల్లో వంద కంపెనీలు పెట్టాలనే ప్రణాళిక నా దగ్గర వుందని, కానీ, ఏపి హైకోర్ట్ హోల్డ్‌లో పెట్టిందని అన్నారు.
KA Paul: మోదీ దగ్గర వీరిని పవన్ కల్యాణ్ తాకట్టుపెడుతున్నారు: కేఏ పాల్
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కి ఏపీ పట్ల ఒకశాతంకూడా చిత్తశుద్దిలేదని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పాల్ విజ్ఞప్తి చేశారు. సినీనటి జయసుధ (Jayasudha) లాంటి వారు బీజేపీలో చేరడం ఏంటని పాల్ ప్రశ్నించారు. క్రైస్తవులు రక్షణకోసం బీజేపీలో చేరుతున్నానని ఆమె చెప్పడం విడ్డూరంగా ఉందని పాల్ అన్నారు. తెలంగాణాలో డిశంబర్‌లోనూ, ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే పది లక్షల కోట్లు అప్పులు తీరుస్తానని చెప్పారు.
KA Paul: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా వారు ఇలా చేస్తున్నారు: కేఏ పాల్
వరస్ట్ సీఎం అని జగన్‌ను పిలుచుకుంటున్నాము. నాలుగేళ్లు అయింది. ఒక్క రాజధానే కట్టలేకపోయారు. మూడు రాజధానులు ఎలా చేస్తాడు అంటూ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబుపై అక్కసుతోనే అమరావతిని నాశనం చేశారు అంటూ విమర్శించారు. అప్పులకు వడ్డీ కట్టలేక వడ్డీలు కట్టేందుకు సీఎం జగన్ కొత్త అప్పులు చేస్తున్నాడని పాల్ విమర్శించారు. జనసేన అధినేత పవన్ పైనా పాల్ విమర్శలు చేశారు. మోదీ మీద వున్న ప్రేమ గాజువాక ప్రజల మీద పవన్‌కు లేదంటూ విమర్శించారు. అమిత్ షా నాకోసం పది గంటలు ఎదురు చూశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే విశాఖను లాస్ ఏంజిల్స్‌లా తయారు చేస్తానని పాల్ అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే గా, విశాఖలో ఎంపీగా పోటీ చేస్తానని పాల్ చెప్పారు.