Prakasam Crime : కోడికత్తితో దాడి.. వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు.

Prakasam Crime
Prakasham Crime : ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు. శనివారం రాత్రి సమయంలో రామకృష్ణారెడ్డి, అజేంద్రరెడ్డికి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి, అజేంద్రరెడ్డి కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడారని తెలుస్తోంది. అవమానభారంతో అజేంద్రరెడ్డి కోడి కోసే కత్తితో రామకృష్ణారెడ్డిపై దాడి చేశాడు. దాడిలో తీవ్రగాయాలపైన రామకృష్ణ మృతి చెందాడు.
చదవండి : Prakasam : బస్సులో ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో డ్రైవర్‌కే తెలియదు
దాడి అనంతరం బల్లికురవ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు అజేంద్రరెడ్డి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజేంద్రరెడ్డి స్నేహితుడు రామాంజనేయరెడ్డిని కూడా అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి : Prakasam : ఏపీలో మరో బస్సు ప్రమాదం…