ఏపీలో IPSలకు పదోన్నతులు, బదిలీలు : అదనపు డీజీగా ఆర్కే మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు IPSలకు పదోన్నతులు, బదిలీలు చేసింది జగన్ ప్రభుత్వం. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్‌గా హరీశ్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్.ఖాన్, ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. గుంటూరు రేంజ్ ఐజీగా జె.ప్రభాకర్ రావు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్ లాల్, డీజీపీ కార్యాలయంలో లీగల్ ఐజీగా నాగేంద్రకుమార్,
ఇంటెలిజెన్స్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్ కుమార్, ఏసీబీ ఐజీగా అశోక్ కుమార్, ఏలూరు రేంజ్ డీఐజీగా కె.వి.మోహన్ రావు, నర్సీపట్నం OSDగా సుమిత్ సునీల్, APSC కాకినాడ కమాండెంట్‌గా అమిత్ బర్దార్, కర్నూలు అదనపు SPగా గౌతమిశాలి, SIB చీఫ్‌గా శ్రీకాంత్, IG లీగల్‌గా పి.హరికుమార్, CID DIGగా హరికృష్ణ, ACB అడిషనల్ డైరెక్టర్‌గా ఎస్వీ రాజశేఖర్ బాబులను నియమించింది ప్రభుత్వం.
Read More : తెలంగాణ బడ్జెట్ : కేసీఆర్ పాలనలో అభివృద్ధి బాటలో రాష్ట్రం – తమిళిసై