Road Accidents : హైదరాబాద్, గుంటూరులో రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి
తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించి.. బైకర్ ను ఢీకొట్టింది. దీంతో అతను ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు.

Road Accidents
Telugu States : రోడ్డు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అత్యంత వేగంగా నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాగా..మిగతా ముగ్గురు విద్యార్థులు. హైదరాబాద్ లో ఓ కారు మితిమీరిన వేగంతో ప్రయాణించి.. బైకర్ ను ఢీకొట్టింది. దీంతో అతను ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు. గుంటూరులో పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వెళుతుండగా…జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.
Read More : Mahesh Babu: మౌంటెన్ డ్యూ కొత్త యాడ్‌తో మహేష్.. బుర్జ్ ఖలీఫా పై నుంచి కిందకి బైక్‌తో స్టంట్..
హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లై ఓవర్ రెయిలింగ్‌పై నుంచి ఎగిరి కిందకు పడిపోయాడు. అంతెత్తు పైనుంచి కిందకు పడడంతో తల పగిలి స్పాట్‌లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు పడి చనిపోయిన వ్యక్తిని కర్నూలు జిల్లాకు చెందిన భరద్వాజ్‌గా గుర్తించారు పోలీసులు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భరద్వాజ్ వయస్సు 27 ఏళ్లు. ఫ్లై ఓవర్‌పై జరిగిన ప్రమాదం, భరద్వాజ్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More : Love Affair : ప్రేమించాడని యువకుడిని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు పెనుమాక గ్రామానికి చెందిన సతీశ్ రెడ్డి, ఎస్‌కే రాజు, షేక్ పై కంబర్‌గా గుర్తించారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తిరిగి బైక్‌పై స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. షేక్ పై కంబర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. తీవ్రగాయాలైన సతీశ్‌రెడ్డి, ఎస్‌కే రాజులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు మంగళగిరి పోలీసులు.