Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ

Road Accident in Palnadu District

Updated On : May 17, 2023 / 7:00 AM IST

Andhrapradesh: ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు అంబులెన్సు సహాయంతో క్షతగాత్రులను స్థానిక గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. లారీ ఢీకొనడంతో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో మృతుల్లో ఎక్కువగా ఆటో ముందుభాగంలో కూర్చున్నవారు ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా మిర్చి కూలీ పనులకు ఆటోలో వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన పొందుగల ప్రాంతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం.