చంద్రబాబు చుట్టూ పవన్ తిరుగుతున్నారు.. మహిళల గురించి బండ్ల గణేశ్ నీచంగా..: రోజా

బండ్ల గణేశ్ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ ఆయన ఎవరని ప్రశ్నించారు.

చంద్రబాబు చుట్టూ పవన్ తిరుగుతున్నారు.. మహిళల గురించి బండ్ల గణేశ్ నీచంగా..: రోజా

Minister Roja

Updated On : February 29, 2024 / 2:48 PM IST

పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఎన్నాళ్లయిందంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ప్రశ్నించారు. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అందుకే పవన్ కల్యాణ్ అధ:పాతాళానికి వెళ్లారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని అధ్యాత్మిక కేంద్రాలకు ప్యాకేజీల ద్వారా ఆలయాల టూరిజాన్ని రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని, బూత్ కమిటీల విషయంలో ఇప్పుడు పార్టీ కేడర్‌ను తప్పు పడుతున్నారని అన్నారు.

పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని రోజా చెప్పారు. రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన కనీసం 30 సీట్లు తెచ్చుకోలేకపోయిందని విమర్శించారు. బండ్ల గణేశ్ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ ఆయన ఎవరని ప్రశ్నించారు. స్వశక్తితో ఎదుగుతున్న మహిళల గురించి నీచంగా మాట్లాడుతున్నారని, ఇదే ఆయన నైజం అని అన్నారు.

సీఎం జగన్‌ను రాష్ట్ర ప్రజలు అందరూ ఆదరిస్తున్నారని రోజా తెలిపారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల్లో జగన్ పట్ల ఉన్న అభిమానం కనపుడుతోందని చెప్పారు.

 Also Read: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్