Sajjala: ఏపీ ఎన్నికల్లో మాకు ముఖ్యంగా వారి మద్దతు లభించింది: సజ్జల
చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చని తెలిపారు. ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొన్న...

Sajjala Ramakrishna Reddy
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సరళి చూస్తే ఐదేళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ పాటుపడ్డారని వాళ్లే ఆశీస్సులు ఇచ్చారని చెప్పారు. ప్రజల కోసం జగన్ నిలబడితే ఆయన కోసం ప్రజలు నిలబడ్డారని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతు ఇచ్చారనిపిస్తోందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత ఇవాళ కనిపించిందని అన్నారు. చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చని తెలిపారు. ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలకు, వృద్దులు, పేద వర్గాల వారని.. ఈ వర్గాలు ఎవరితో ఉన్నాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశామని, రీ పోలింగ్ అడిగామని చెప్పారు. పోలీసుల వైఖరి కొన్ని చోట్ల అన్యాయంగా ఉందని తెలిపారు. రిటైర్ అయిన అధికారి నుంచి కొందరు పోలీసు అధికారులకు ఫోన్లు వెళ్లాయని, పిర్యాదు చేశామని అన్నారు. తెలుగు దేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తోందని చెప్పారు.
టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపోయి దాడులు చేసిందని అన్నారు. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని, ప్రశాతంగా ఎన్నికలు జరగడమే తమ ఉద్దేశమని చెప్పారు. తాము సంయమనంతో ఉండటంతో ప్రజలకు ఇబ్బంది కలగలేదని అన్నారు.
Kodali Nani : ప్రజలు జగన్‌ను మరోసారి దీవిస్తారు, అందుకు ఇదే నిదర్శనం- కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు