AP BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఖరారు..

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది.

AP BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఖరారు..

somu veerraju

Updated On : March 10, 2025 / 11:05 AM IST

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ మూడు స్థానాలకు పోటీ చేస్తుండగా.. జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది. తాజాగా బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు.

Also Read: AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీరే..!

జనసే పార్టీ అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను అభ్యర్థులగా ఎంపిక చేశారు. తాజాగా బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది.

 

నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో టీడీపీ అభ్యర్థులతోపాటు సోము వీర్రాజు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయే కూటమి అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశం ఉంది.