సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్

సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్

Updated On : March 17, 2021 / 4:14 PM IST

అమరావతి : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో హీట్ పెంచుతుంటే,  ఏప్రిల్  రాకుండానే భానుడి సెగలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ ఏపీ లో ఎండల సంగతి అసలు చెప్పక్కర్లేదు.  పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

వేసవి తాపం తీవ్రంగా ఉండనున్నందున వృద్దులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇది వరకు సాయంత్ర 5 గంలకు పోలింగ్ ముగిసేది. ఎండలు మండిపోతుండటంతో  ఏపిలో పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్  ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మావోయిస్టు ప్రభావం, తదితర కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య అటవీ ప్రాంతాల్లో ముందుగనే పోలింగ్ పూర్తి చేస్తారు.

అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కురుప్పాం, పార్వతీపురం, సాలూరు, పంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే