Chandrababu Naidu : కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలి
ఏపీ లో కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు.

Chandra Babu Naidu
Chandrababu Naidu : ఏపీ లో కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని…అధికారంలో వచ్చాక సరిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.
జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆయన అన్నారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలతో రాష్ట్రం కూడా శ్రీలంక లాగా అయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో 80 శాతం పూర్తయిన పనులు కూడా పూర్తిచేయలేని జగన్ ఇప్పుడు మరో 5 ఏళ్ళు సమయం కోరడాన్నిటీడీపీ నేతలు తప్పుపట్టారు.
జగన్ పాలనపై చివరికి ఆయన సొంత సామాజిక వర్గం నేతలు కూడా సంతోషంగా లేరని.. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారని సమావేశంలో పలువురునేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న విధానంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందని నాయకులు చంద్రబాబుకు వివరించారు.
Also Read : Ram Charan: ముంబై థియేటర్లో చెర్రీ.. ప్రేక్షకులకు సడెన్ సర్పైజ్!
సీపీఎస్ విషయంలో ఆందోళన చేస్తున్న వారికి టీడీపీ సంఘీభావం తెలిపింది. విశాఖ మధురవాడలో ఐటీ హిల్స్ నందు రూ.1,550 కోట్ల విలువచేసే భూదందాకు ఏ2 విజయాసాయిరెడ్డి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా, అమ్మకం ద్వారా వేల సీఎంజగన్మోహన్ రెడ్డి వేల కోట్లు ఆర్జిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.