Chandrababu : టీడీపీ E-పేపర్‌ను ప్రారంభించిన చంద్రబాబు, ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా అభివర్ణన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త.. ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పని చేస్తుందన

Chandrababu Epaper
Chandrababu : టీడీపీ నుంచి ఈ-పేపర్ వచ్చింది. దాని పేరు ‘చైతన్య రథం’. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ లో ఈ-పేపర్ ను ప్రారంభించారు. ‘చైతన్య రథం’ పేరిట ఈ-పేపర్ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త.. ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పని చేస్తుందన్నారు. 60శాతం మంది ప్రజలు ఇప్పటికే సోషల్ మీడియాకు అలవాటు పడ్డారని చంద్రబాబు చెప్పారు. సొంతూరు విశేషాలు రియల్ టైమ్ లో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న 70లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసేలా చైతన్య రథం ఈ పేపర్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఒకే క్లిక్ తో 30లక్షల మంది పార్టీ శ్రేణులకు ఈ పేపర్ ను పంపామన్నారు. ఇప్పటికే అనేక సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సమాచారం చేరవేస్తున్నామన్నారు.
Paritala Sunitha: శ్రీరామ్ పోటీ చేసే స్థానం ప్రకటించిన పరిటాల సునీత
ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదంపైనా చంద్రబాబు స్పందించారు. సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి భవన నిర్మాణంపై మాట్లాడరని విమర్శించారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. నిన్న-మొన్న కూడా భారతీ సిమెంట్ ధరలు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డి పీడిత బాధితులే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పిందని వాపోయారు.
YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు
ప్రజా చైతన్యం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని చంద్రబాబు అన్నారు. ఇది 5కోట్ల మంది తెలుగు ప్రజల బాధ్యత అన్నారు. అoచనాలకు మించి జగన్ రెడ్డి చేసిన అప్పు భారానికి అన్ని వర్గాలు బాధితులే అని వాపోయారు. రైతులు, ఉద్యోగస్తులు, వాహనదారులు ఇలా అన్ని వర్గాల వారు మోసపోయి దగాపడ్డారని చంద్రబాబు వాపోయారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.