రాజధాని రగడ : రైతులను చూస్తుంటే బాధేస్తోంది..తుళ్లూరులో బాబు

  • Published By: madhu ,Published On : December 23, 2019 / 10:20 AM IST
రాజధాని రగడ : రైతులను చూస్తుంటే బాధేస్తోంది..తుళ్లూరులో బాబు

Updated On : December 23, 2019 / 10:20 AM IST

రైతు దినోత్సవం రోజున..రైతులు రోడ్డెక్కడం..చూస్తుంటే..బాధగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని రైతులకు అండగా ఉంటానన్నారు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం తుళ్లూరులో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులునుద్దేశించి..మాట్లాడుతూ…

పనులన్నీ వదిలిపెట్టి..ఆందోళన దారికొచ్చే పరిస్థితి ఏర్పడిందని, కులాలు, మతాలు..ప్రాంతాలు లేవన్నారు. అమరావతి..29 గ్రామాల రైతులు, రైతు కూలీలు..న్యాయం చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఏడు జిల్లాలు, మరో పక్క ఆరు జిల్లాలు..మధ్యలో గుంటూరు జిల్లాలో అమరావతి వచ్చిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రానికి రాజధాని లేదు..16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందని, ఈ సమయంలో భూమి కొనలేమని..అందుకే భూములు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు.

ఎన్నో మీటింగ్ లు పెట్టి..చర్చలు జరిపి..అన్నీ ఆలోచించిన తర్వాతే..ప్యాకేజీకి (ల్యాండ్ పూలింగ్) ఒప్పుకున్నారని వివరించారు. రైతులందరికీ న్యాయం జరగాలని, అసైన్డ్ భూములున్న పేదలకు, అసలు భూములు లేని వారికి న్యాయం కల్పించేందుకు ప్యాకేజీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

33 వేల ఎకరాలను రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని, సింగపూర్ లాంటి దేశం అండగా ఉందని ఆనాడు చెప్పడం జరిగిందన్నారు. తమ భూముల విలువ పెరుగుతుందని రైతులు ఆశించినట్లు తెలిపారు. ఏ రైతుకు, రైతు కూలీకి అన్యాయం జరగకుండా..శాశ్వతంగా అందరికీ సహాయం చేస్తామని ఆనాడు చెప్పడం జరిగిందన్నారు.

* రైతులందరికీ న్యాయం జరగాలన్నదే ఆశ. 
* చరిత్రలో అమరావతి శాశ్వతంగా నిలిచిపోతుందని ఆశించా. 
* పొలం పనులు చేసుకొనే రైతులు రోడ్డున పడాల్సి వచ్చింది. 
* రాజధాని కోసం రైతులు పోరాడుతున్నారు. 
* రాయపూడి నుంచి బాబుకు మద్దతుగా యువకులు బైక్ ర్యాలీ. 

మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదిక ఇవ్వడంపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారానికి ఆరో రోజు చేరుకుంది. వినూత్నంగా నిరసలు, ఆందోళనలు చేస్తున్నారు. 
Read More : రాజధానిలో వినూత్న నిరసనలు : అరగుండుతో..నవగ్రహాల చుట్టూ ప్రదిక్షణలు