బిగ్ టాస్క్.. ఏపీలో జులై ఫస్ట్ నుంచి ఇంటింటికీ రాజకీయమే..
వాళ్లు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తే ఆటోమేటిక్‌గా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది.

Chandrababu-Jagan
ఏపీలో పీక్ లెవల్ పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇటు కూటమి..అటు వైసీపీ తగ్గేదేలే అంటున్నాయి. ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా జులై ఫస్ట్ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రెండు నెలల పాటు ప్రజల్లోనే ఉండి..ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలపై ఫీడ్ బ్యాక్ సేకరించాలని కూడా సూచించారు. గత ప్రభుత్వ పాలనకు, కూటమి పాలనకు తేడా ఏంటో వివరించేందుకు రెడీ అవుతున్నారు టీడీపీ నేతలు. కౌంటర్‌గా వైసీపీ కూడా ఓ కార్యక్రమం చేపట్టింది.
రీకాల్ చంద్రబాబు మ్యానిఫెస్టో పేరుతో జనంలోకి వెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. దీంతో జులై 1 నుంచి ఏపీ రాజకీయాలు హీటెక్కేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండూ కీలక కార్యక్రమాలను చేపడుతున్నాయి. రెండు పక్షాలు కూడా..ఇంటింటికీ రాజకీయం చేరువ చేయనున్నాయి. ఎవరి వాదనను వారు వినిపించనున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీది ఒక వాదనగా ఉండగా..ప్రతిపక్ష వైసీపీది మరో వాదనగా ఉంది. దీంతో జులై ఫస్ట్ నుంచి ఏపీ పాలిటిక్స్ హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే కూటమికి హానీమూన్ పీరియడ్ ప్రభుత్వానికి ముగిసిందని..కూటమి పాలనకు ఏడాది ముగిసింది కాబట్టి ఇక సమరమేనని ప్రకటించారు. అయితే ఇంత వరకు బానే ఉన్నా హానీమూన్ పీరియడ్ ముగిసింది ఎవరికనే డిస్కషన్ నడుస్తోంది. కూటమి ఏడాదిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ..ఒక్కో హామీని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఏడాది పాలన పూర్తయ్యే సరికి అన్నీ కాకపోయిన సూపర్ సిక్స్ హామీల్లో మెజార్టీ స్కీమ్స్‌ను ల్యాండింగ్ చేసింది. కానీ అపోజిషన్‌లో ఉన్న వైసీపీ తన రోల్‌ను ఎంతవరకు పూర్తి చేసిందనేది ఇంట్రెస్టింగ్ టాపిక్.
జగన్, లీడర్ల ప్రెస్‌మీట్లు తప్ప ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేసిన పెద్ద కార్యక్రమం ఏం లేదు. నిజానికి వైసీపీనే ఇప్పటివరకు హానీమూన్ పీరియడ్‌లో ఉందని అన్న చర్చ కూడా ఉంది. ఆ మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగుల సమస్యలు అంటూ వైసీపీ అధినేత నిరసనలకు పిలుపునిచ్చినా..క్యాడర్, లీడర్లు అటువైపు చూసినవాళ్లే లేరు. ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ కొందరు నాయకులు మీడియా కవరేజ్ కోసం నిరసనలు చేశారన్న టాక్ ఉంది. సేమ్‌టైమ్ ఇప్పటినుంచే కూటమికి వ్యతిరేకంగా పోరాడటం కూడా చాలామంది వైసీపీ నేతలకు ఇష్టం లేదన్న చర్చ కూడా ఉంది.
మాకు దిక్కెవరు జగనన్న? అంటూ ఫ్లెక్సీలు
రెగ్యులర్‌గా మీడియాలో కనిపించే లీడర్లు తప్ప..ఏడాదిగా వైసీపీ నేతలు నియోజకవర్గాల్లో యాక్టీవ్‌గా కనిపించని పరిస్థితి. మెజారిటీ నేతలు అంతా రిలాక్స్ మోడ్‌లోనే ఉన్నారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు లేరు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే..పండుగులు, అధినేత బర్త్‌డేలు వస్తే ఫ్లెక్సీలు వేసే నేతలు కూడా లేని పరిస్థితి ఉందట. గత ఎన్నికల్లో ఓడిన చాలా మంది అభ్యర్థులు ఇప్పటికీ నియోజకవర్గం ముఖం కూడా చూడటం లేదు.
కొన్ని ప్రాంతాల్లో అయితే మాకు దిక్కెవరు జగనన్న అని ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడే ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ క్యాడర్ మధ్య బంధం అంతంత మాత్రమే ఉండేదంటున్నారు. ఇక అపోజిషన్‌లోకి వచ్చాక కొందరు లీడర్లు ఎక్కడున్నారో కూడా క్యాడర్‌కు తెలియని పరిస్థితి. కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించినా వాని పనితీరును సమీక్షించినవారే లేరు.
అందుకే హానీమూన్ పీరియడ్ ముగిసిందని జగన్ చెప్పాల్సింది కూటమికి కాదని వైసీపీకే అని అంటున్నారు. వైసీపీ లీడర్లను మేలుకొలిపి జనంలో ఉంచితేనే..జగన్ పిలుపునిచ్చిన రీకాల్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం అంతో ఇంతో ప్రజల్లో వెళ్తుందని అంటున్నారు. అధికార పక్షానికి ఎలాగూ మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడర్, లీడర్లు బలంగా ఉంటారు.
వాళ్లు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తే ఆటోమేటిక్‌గా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ లీడర్లంతా ఇప్పటికీ కామ్‌గా ఉన్నారు. పైగా అప్పుడే కూటమిపై వ్యతిరేకత వస్తుందని జగన్ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. జనాల్లో కూటమిపై వ్యతిరేకతను పెంచడం కంటే, తమ పార్టీపై అనుకూలత పెంచుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. జులై ఫస్ట్ నుంచి ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.