TDP vs YCP Leaders : చంద్రబాబు, పవన్ భేటీపై అంబటి రాంబాబు ట్వీట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న

అంబటి రాంబాబు ట్వీట్ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

TDP vs YCP Leaders : చంద్రబాబు, పవన్ భేటీపై అంబటి రాంబాబు ట్వీట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న

Ambati Rambabu and Ayyanna Patrudu

Updated On : December 18, 2023 / 11:21 AM IST

Ayyanna Patrudu – Ambati Rambabu : ఏపీలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల అధినేతలు గెలుపే లక్ష్యంగా తమతమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు వీరి మధ్య విస్తృత చర్చ జరిగింది. సీట్ల కేటాయింపు, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితర అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇక నుంచి కలిసికట్టుగా బహిరంగ సభల నిర్వహణపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలాఉంటే పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్లువేస్తూ ట్వీట్లు చేశాడు.

Also Read :  Lokesh YuvaGalam: అప్పుడు ‘వస్తున్నా మీకోసం’.. ఇప్పుడు యువగళం..! అగనంపూడిలో ముగియనున్న లోకేశ్ పాదయాత్ర

‘రాష్ట్రంలో ఇల్లులేని వారు ఎవరి ఇంటికి ఎవరు వెళ్లిన చివరకు అక్కడే స్థిరపడతారు’ అంటూ హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీపై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. కొద్దిసేపటికే జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేస్తూ అంబటి ట్వీట్ చేశారు. ‘నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి.. అర్థమయిందా! నాదెండ్ల విముక్త జనసేన కోసం పోరాడేవాడే అసలైన సైనికుడు’ అంటూ అంబటి సెటైరికల్ ట్వీట్ చేశారు. అయితే, అంబటి ట్వీట్లపై టీడీపీ, జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. అంబటి ట్వీట్లకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు ట్వీట్ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Also Read : Pawan Kalyan: పదేళ్ల తర్వాత మళ్లీ పవన్‌ ఇంటికి చంద్రబాబు.. ఎందుకంటే?

‘సీట్ పోయింది.. ట్వీట్ మిగిలింది.. అయ్యోయ్యో’ అంబటి..! అంటూ అయన్న పాత్రుడు సెటైరికల్ ట్వీట్ తో అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వీరి మధ్య ట్వీట్ల వార్ జరగడం కొత్తేమీ కాదు.. గతంలో పలుసార్లు టీడీపీ, చంద్రబాబును ఉద్దేశించి అంబటి సోషల్ మీడియాలో పోస్టులకు అయ్యన్న స్పందిస్తూ కౌంటర్లు ఇచ్చారు.