వారిద్దరూ క్షమాపణలు చెప్పాల్సిందే..వర్ల రామయ్య డిమాండ్

ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీలిద్దరూ క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బూతులతో దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలపై పలు విమర్శలు చేశారు.
బూతులు మాట్లాడిన వ్యక్తిని ఎలా మంత్రి చేశారని ప్రశ్నించారు. అసలు..చేసిన వ్యక్తిని అనాలి..మంత్రిమండలిలో తీసుకున్న వ్యక్తి అపరాధిగా నిలబడాలి..రాష్ట్ర ముఖ్యమంత్రి దోషి అన్నారు. దేవినేని ఉమా తల్లిదండ్రులకు, సభ్య సమాజానికి కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయ చరిత్రలో బూతుల మంత్రిగా నిలిచిపోతారన్నారు.
వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పినంత మాత్రానా పాప ప్రక్షాళన కాలేదన్నారు. బాబు
ఒక సామాన్య కుటుంబంలో జన్మించారన్నారు. ఖర్జూర నాయడికి, బాబుకు వంశీ క్షమాపణలు చెప్పాలని తెలిపారు. లోకేష్ బాబు తెలుగు చదవలేక రెండు తప్పులు చదివితే..ఇష్టమొచినట్లు నిక్ నేమ్‌లు పెట్టి..అల్లరి చేస్తావా ? అంటూ నిలదీశారు. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ నిరక్షరాస్యత అనే మాట అనే లేకపోయారని ఎద్దేవా చేశారు. బాబు స్క్రిప్ట్ ఇచ్చారు..చదివానన్న వంశీ..ఇప్పుడు జగన్ స్క్రిప్టు ఇస్తే చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. సభ్య సమాజానికి, గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్య స్కూల్ మాస్టరు కుమారుడిగా ఉన్న వల్లభనేని వంశీకి అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో వెల్లడించాలని వర్ల రామయ్య మరోసారి డిమాండ్ చేశారు.
Read More : దేవినేని ఉమ ఫైర్ : సీబీఐ చిటికేస్తే..జగన్ ఏమవుతారు