Telugu Desam Party : టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి 40 ఏళ్లు

తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్దాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గోంటుండగా...

Telugu Desam Party : టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి 40 ఏళ్లు

TDP @ 40 years

Updated On : March 29, 2022 / 6:37 PM IST

Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్దాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గోంటుండగా… ఏపీలోని అమరావతిలో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ పాల్గోంటారు.

1982 మార్చి 29న విశ్వవిఖ్యాత,నటసార్వభౌమ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగు దేశం పార్టీని ప్రారంభించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో పార్టీ ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను సందర్శిస్తారు.

అనంతరం అక్కడి నుంచి బయలు దేరి ఎన్టీ ఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో జరిగే పార్టీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గోంటారు.

Also Read : Chandrababu Naidu : ఏపీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది
అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గోంటారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి లోని నివాసం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు నిర్వహించే సైకిల్ ర్యాలీలో పాల్గోంటారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీకేంద్ర కార్యాలయంలో జరిగే బహిరంగ సభలో లోకేష్ పాల్గోంటారు