Thief Hal Chal : విజయవాడలో అర్ధరాత్రి దొంగ హల్ చల్
విజయవాడ వెస్ట్ ఏసీపీ హనుమంతురావు అధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

THIEF
Thief Hal Chal in Vijayawada : విజయవాడలో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. నిర్మలా స్కూల్ సమీపంలో చోరి చేసేందుకు దొంగ యత్నించాడు. స్థానికులు దొంగను పట్టుకునేందుకు యత్నించగా ముప్పతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు పోలీసులు స్థానికుల సహాయంతో దొంగను పట్టుకున్నారు.
పోలీసులు దొంగను పట్టుకుని ప్రశ్నించడంతో రెండు బ్యాగులు దొంగలించాని చెప్పారు. డబ్బులు ఉన్నాయని బ్యాగులు తీశానని తెలిపారు. రెండు బ్యాగులలో డబ్బులు లేక పోవడంతో వాటిని సందులో పడేశానని పేర్కొన్నారు.
తాను దొంగతనం చేసే సమయంలో ఇంటి యజమాని నిద్రపోతున్నాడని తెలిపారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ హనుమంతురావు అధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.