తండ్రీ కొడుకుల మధ్య టికెట్ వార్.. అమలాపురం వైసీపీలో రసవత్తర రాజకీయం

టికెట్ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడ్డ విబేధాలు బహిర్గతం అయ్యాయి. మరోపక్క విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే తాము సహకరించబోము అని వైసీపీ సీనియర్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు.

తండ్రీ కొడుకుల మధ్య టికెట్ వార్.. అమలాపురం వైసీపీలో రసవత్తర రాజకీయం

Vishwaroop Pinipe Vs Srikanth Pinipe

Updated On : January 1, 2024 / 5:52 PM IST

Vishwaroop Pinipe : అమలాపురం టికెట్ విషయంలో మంత్రి విశ్వరూప్, ఆయన కుమారుడు శ్రీకాంత్ మధ్య వార్ నడుస్తోంది. అమలాపురంలో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని విశ్వరూప్ ప్రకటించారు. అయితే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. టికెట్ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడ్డ విబేధాలు బహిర్గతం అయ్యాయి. మరోపక్క విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే తాము సహకరించబోము అని వైసీపీ సీనియర్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు.

సర్వేల ఆధారంగా వైసీపీ నాయకత్వం అమలాపురం టికెట్ ను మంత్రి విశ్వరూప్ కు కాకుండా ఆయన చిన్న కుమారుడు శ్రీకాంత్ కు కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమలాపురం వైసీపీ అభ్యర్థిగా శ్రీకాంత్ పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి విశ్వరూప్ అమలాపురం అభ్యర్థిపై బాంబు పేల్చారు. నేను అమలాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను అని తేల్చి చెప్పారు. సర్వేలలో విశ్వరూప్ కన్నా ఆయన కుమారుడు శ్రీకాంత్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తేలడంతో అతడికే టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది.

Also Read : డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..! సిక్కోలు వైసీపీలో హైటెన్షన్

వచ్చే ఎన్నికల్లోనూ నాకే టికెట్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాను అని విశ్వరూప్ ధీమాగా ఉన్నారు. అయితే, ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుడికి అమలాపురం టికెట్ ఇస్తారనే టాక్ మొదలైంది. మొత్తంగా తండ్రికి తిరిగి టికెట్ దక్కుతుందా? లేక కొడుక్కి ఇస్తారా? అన్నది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని అమలాపురంకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు తేల్చి చెప్పారు.

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?