Tirumala Laddu Problems : తిరుమలలో భక్తులకు లడ్డూ కష్టాలు.. కౌంటర్ల దగ్గర భారీగా రద్దీ

తిరుమలలో భక్తులను లడ్డూ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవుడు కరుణించినా.. లడ్డూ కౌంటర్స్ లో సిబ్బంది మాత్రం కరుణించడం లేదు. లడ్డూ పంపిణీ వేగంగా సాగక భక్తుల క్యూలైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కౌంటర్స్ లోని సిబ్బందితో భక్తులు గొడవకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tirumala Laddu Problems : తిరుమలలో భక్తులకు లడ్డూ కష్టాలు.. కౌంటర్ల దగ్గర భారీగా రద్దీ

Tirumala Laddu (Photo Credit : Google)

Updated On : November 29, 2022 / 7:24 PM IST

Tirumala Laddu Problems : తిరుమలలో భక్తులను లడ్డూ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవుడు కరుణించినా.. లడ్డూ కౌంటర్స్ లో సిబ్బంది మాత్రం కరుణించడం లేదు. లడ్డూ పంపిణీ వేగంగా సాగక భక్తుల క్యూలైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కౌంటర్స్ లోని సిబ్బందితో భక్తులు గొడవకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గతంలో కేవీఎం అనే కాంట్రాక్ట్ సంస్థ ద్వారా లడ్డూల విక్రయం జరిగేది. అయితే, ఆ సంస్థ సరిగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు సరైన సమయానికి డ్యూటీలకు వచ్చే వారు కాదు. దీంతో ఆ సంస్థను కాంట్రాక్ట్ నుంచి తప్పించింది టీటీడీ. ఆ స్థానంతో తన సిబ్బంది, శ్రీవారి సేవకులను నియమించింది. అయితే, వారికి అనుభవం లేకపోవడంతో లడ్డూల అమ్మకం నెమ్మదిగా సాగి.. భక్తుల సహనానికి పరీక్ష పెడుతున్న పరిస్థితి నెలకొంది.

Also Read : TTD: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. డిసెంబర్ 1నుంచి అమల్లోకి ..

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా చూస్తారు. శ్రీవారి దర్శనం తర్వాత ప్రతీ భక్తుడు కచ్చితంగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తాడు. క్యూలైన్ లో నిల్చుని మరీ లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. అయితే, లడ్డూ కౌంటర్లలో తరుచుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Also Read : Tirumala Laddu Prasadam Weight : తిరుమల లడ్డూ బరువు వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

కేవీఎం అనే సంస్థ లడ్డూ కౌంటర్లలో కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించి లడ్డూల విక్రయించింది. అయితే, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు డ్యూటీకి వచ్చే వారు కాదు. దీంతో కేవీఎం సంస్థను తప్పించింది టీటీడీ. వారి స్థానంలో శ్రీవారి సేవకులను లడ్డూ కౌంటర్లలో లడ్డూల వితరణకు వినియోగించింది. అయితే, వారికి అనుభవం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తరుచుగా లడ్డూ కౌంటర్ల వద్ద పొడవాటి క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ పరిస్థితిపై భక్తులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే టీటీడీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.