Tirumala : నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆన్ లైన్ టికెట్ల కోటా విడుదల

మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. తిరుమలలో వైభవంగా కైసిక ద్వాదశి ఆస్థానం జరుగుతోంది.

Tirumala : నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆన్ లైన్ టికెట్ల కోటా విడుదల

Tirumala (5)

Updated On : November 24, 2023 / 7:33 AM IST

Tirumala Srivari Special Darshan Online Ticket : నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆన్ లైన్ టికెట్ల కోటా విడుదల కానుంది. ఫిబ్రవరి నెల 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది.

తిరుమలలో వైభవంగా కైసిక ద్వాదశి ఆస్థానం జరుగుతోంది. వేకువజామున మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న(గురువారం) శ్రీవారిని భక్తులు 45,503 దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చింది.

Gold Price Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 31 కంపార్ట్ మెట్లు నిండి వెలుపల క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.