Tirupati Missing Students : తిరుపతిలో అదృశ్యం, యూపీలో ప్రత్యక్షం.. ఆ ఐదుగురు 10వ తరగతి పిల్లల ఆచూకీ లభ్యం

తిరుపతిలో 10వ తరగతి విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ వీడింది. 10వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో గుర్తించారు పోలీసులు.

Tirupati Missing Students : తిరుపతిలో అదృశ్యం, యూపీలో ప్రత్యక్షం.. ఆ ఐదుగురు 10వ తరగతి పిల్లల ఆచూకీ లభ్యం

Updated On : November 13, 2022 / 5:09 PM IST

Tirupati Missing Students : తిరుపతిలో 10వ తరగతి విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ వీడింది. 10వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం వారు యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు. తిరుపతిలోని అన్నమయ్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ నెల 9వ తేదీన అదృశ్యమయ్యారు. పిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు తిరుపతి పడమర పోలీసులు. పిల్లలను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆగ్రాకు చేరుకున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ నెల 9వ తేదీ ఉదయం స్టడీ అవర్‌ అని చెప్పి స్కూల్ కి వెళ్లిన పిల్లలు ఆ తర్వాత కనిపించకుండా పోయారు. విద్యార్థులు రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. అయితే విద్యార్థులు ఆగ్రాకు ఎందుకు వెళ్లారు. తాజ్ మహల్ చూడడానికి వెళ్లారా? లేదా వేరే కారణం ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

విద్యార్థుల మిస్సింగ్‌ తిరుపతి జిల్లాలో కలకలం రేపింది. నెహ్రూ నగర్‌లో ఉన్న శ్రీ అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9వ తేదీన ఉదయం స్టడీ అవర్స్ పేరుతో పిల్లలు స్కూల్ కి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లలేదు.