Tirumala Tirupati : శ్రీవారి దర్శనాల పేరిట భక్తులను మోసంచేసే ఘరానా మోసగాడు అరెస్ట్
గతంలో కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ వద్ద పీఆర్వోగా మారతీ పనిచేసినట్లు పోలీసులు తెలిపారు

Tirumala Tirupati
TTD : శ్రీవారి దర్శనాలు పేరిట భక్తులను మోసం చేసే ఘరానా మోసగాడు అరెస్టయ్యాడు. భక్తులను మోసం చేసిన కేసులో బెంగళూరు ఎలహంక కు చెందిన హెచ్. మారుతి అనే మోసగాన్ని తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవాణి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని కర్ణాటకకు చెందిన నలుగురి వద్ద రూ.42 వేలు తీసుకొని మారుతీ మోసం చేశాడు. మరో కేసులో బళ్ళారికి చెందిన ఓ అడ్వకేట్ కు లైఫ్ టైం డోనార్ టికెట్లు ఇప్పిస్తామని రూ. 28 లక్షలకు మారుతి టోకరా వేశాడు.
గతంలో కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ వద్ద పీఆర్వోగా మారతీ పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ బోర్డు మెంబర్ మాదిరి పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి నిందితుడు మోసాలకు పాల్పడ్డాడు. మారుతిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఒక టీం ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు బెంగళూరులో మారతీ ఉంటున్నట్లు తెలుసుకొని తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.