TTD Board Emergency Meeting : టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం.. తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఉత్కంఠ..

మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం..

TTD Board Emergency Meeting : టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం.. తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఉత్కంఠ..

Ttd Chairman Br Naidu (Photo Credit : Google)

Updated On : January 10, 2025 / 4:35 PM IST

TTD Board Emergency Meeting : టీటీడీ బోర్డు సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై బోర్డు సభ్యులు చర్చింబోతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపైన కూడా చర్చించే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల అమలుపై కూడా సమావేశంలో ప్రస్తావించనున్నారు. మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాబోయే ఏడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు ఏ విధంగా అమలు చేయాలి?
తిరుపతి తొక్కిసలాట ఘటన, రాబోయే ఏడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు ఏ విధంగా అమలు చేయాలి, బాధితులకు నష్టపరిహారం అందజేత, నష్ట పరిహారం ఏ విధంగా అందజేయాలి? పాలక మండలి సభ్యులు బాధితుల స్వగ్రామాలకు స్వయంగా వెళ్లి అందజేయడం, ఇతర ఘటనలపై చర్చించేందుకు పాలక మండలి సమావేశం అవబోతోంది.

Also Read : అందుకే తిరుమల ఘటనను వైసీపీ వాడుకుంటోంది: పంచుమర్తి అనురాధ

టీటీడీ పాలకమండలిపై పవన్ కల్యాణ్ సీరియస్..
అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనికి పాలకమండలి బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలు.. వీరంతా విఫలం అయ్యారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పాలక మండలి ఆ అంశంపై తీవ్ర చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

Tirupati Stampede Tragedy

క్షమాపణలు ఏ విధంగా చెప్పాలి?
తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏ విధంగా క్షమాపణలు చెప్పాలి, పాలక మండలి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలా? లేక మరో విధంగా చెప్పాలా? అనేది బోర్డు మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది.

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో 40 మంది గాయపడ్డారు. వారందరికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. సరైన ఏర్పాట్లు, తగిన బందోబస్తు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. జరిగిన ఘటనకు పవన్ కల్యాణ్ క్షమాపణలు కూడా చెప్పారు.

Also Read : సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని అనుకున్నాను..కానీ..: పవన్ కల్యాణ్