Bhaskar Naidu : 10వేలకు పైగా పాములు పట్టిన అతడు.. కాటుకు గురై ఆసుపత్రిలో..
టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ పాముని పట్టే ప్రయత్నంలో.. ఆయన పాము కాటుకి గురయ్యారు. విషపూరితమైన పాము ఆయనను కాటు వేసింది.

Ttd Snake Catcher Bhaskar Naidu
Bhaskar Naidu : టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ పాముని పట్టే ప్రయత్నంలో.. ఆయన పాము కాటుకి గురయ్యారు. విషపూరితమైన పాము ఆయనను కాటు వేసింది. దీంతో అధికారులు వెంటనే ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి పామును పట్టే సమయంలో భాస్కర్ నాయుడు కాటుకు గురయ్యారు.
Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…
కాగా, పాములను చాకచక్యంగా పట్టుకోవడంలో భాస్కర్ నాయుడు దిట్ట. ఇప్పటి దాకా 10వేలకు పైగా పాములను పట్టుకున్నారు. వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలారు. ఫారెస్ట్ మజ్దూర్ గా రిటైర్ అయినప్పటికి.. భాస్కర్ నాయుడు సేవలను టీటీడీ కొనసాగిస్తోంది.
Reliance Jio 5G speed: ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్ చేయవచ్చు
తిరుమలలో పాము కనిపించింది అని సమాచారం అందితే చాలు.. వెంటనే రంగంలోకి దిగుతారు భాస్కర్ నాయుడు. అది ఎంత పెద్ద పాము అయినా, ఎంత విషపూరితమైనది అయినా… అస్సలు భయపడరు. ఎంతో చాకచక్యంగా, అవలీలగా పట్టుకుంటారు. దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. ఆయన తన చేతులతో వేలాది పాములను పట్టారు. తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పాము కనిపిస్తే చాలు.. స్థానికులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. అలాంటి వ్యక్తి.. పాము కాటుకు గురయ్యారని, ఆయన పరిస్థితి విషమింగా ఉందని తెలిసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఎలాంటి అపాయం జరక్కూడదని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.