టీటీడీ కీలక నిర్ణయం.. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆ విధానం రద్దు..

టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల రూపాయల విలువైన వర్క్స్ జరుగుతూ ఉంటాయి.

టీటీడీ కీలక నిర్ణయం.. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆ విధానం రద్దు..

Tirumala Ttd (Photo Credit : Google)

Updated On : October 5, 2024 / 9:02 PM IST

TTD Key Decision : టీటీడీ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఐదేళ్లుగా తిరుమలలో అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ ఇవాళ రద్దు చేసింది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.

టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతోంది. టీటీడీలో టెండర్ల వ్యవహారాలన్నీ రివర్స్ టెండరింగ్ విధానంలోనే జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. అన్ని విభాగాల్లోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే టీటీడీలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల రూపాయల విలువైన వర్క్స్ జరుగుతూ ఉంటాయి. కొత్తగా భవనాలు నిర్మించడం, రోడ్ల మరమ్మతులు.. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తుంది టీటీడీ.

జగన్ ప్రభుత్వం వీటన్నింటిలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేలా తీసుకొచ్చింది. టీటీడీలో కొనుగోళ్లు కూడా ఉంటాయి. ప్రసాదానికి అవసరమైన ముడి సరుకులు కావొచ్చు, అన్నప్రసాదానికి అవసరమైన బియ్యం, బెల్లం.. ఇటువంటివి కూడా టెండరింగ్ విధానం ద్వారానే కొనుగోలు చేసేవారు. వీటన్నింటిలోనూ గత ఐదేళ్లు రివర్స్ టెండరింగ్ విధానం అమలైంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దైంది.

రివర్స్ టెండరింగ్ అంటే..
ఏదైనా ప్రాజెక్ట్ లేదా వర్క్ కు ఖరారైన కాంట్రాక్ట్ కు మళ్లీ టెండర్లు పిలవడం అన్న మాట. ఈ ప్రక్రియనే రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్ కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని గత వైసీపీ ప్రభుత్వం తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకు వచ్చింది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది. కూటమి సర్కార్ వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.

 

 

Also Read : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..