Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయమైంది. ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ రెడ్డి తలకు డోరు బలంగా తగిలింది.

Kishan
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయమైంది. ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ రెడ్డి తలకు డోరు బలంగా తగిలింది. దీంతో తలకు గాయమైనట్లుగా తెలుస్తోంది.
విజయవాడలో ప్రజా అశీర్వాద సభ నిమిత్తం కిషన్ రెడ్డి అక్కడకు వెళ్లగా.. సభ ముగిశాక ఘటన జరిగింది. కారు డోరు కిషన్ రెడ్డి తలకు కాస్త బలంగా తగిలిందని, అయితే చిన్నపాటి గాయమే తగిలినట్లుగా అధికారులు చెప్పారు.
నుదుటి దగ్గర చర్మం కొంతమేర కమిలిపోగా.. కాస్త రక్తం వచ్చినట్లుగా చెబుతున్నారు. మంత్రి కిషన్ రెడ్డి ఈ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తన పర్యటనను కొనసాగించినట్లు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగానే కిషన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా కలిశారు.
ఈ సంధర్భంగా ఏపీకి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మొద్దని వైసీపీ, టీడీపీలపై విమర్శలు గుప్పించారు.