రాజవంశంలో భగ్గుమన్న విబేధాలు : వారసులం మేమే – ఊర్మిళ

Urmila Gajapathi Raju Press Meet : విజయనగరం రాజవంశంలో విబేధాలు భగ్గుమన్నాయి. పైడితల్లి సిరిమానోత్సవం సాక్షిగా వివాదం మొదలైంది. ఉత్సవంలో సుధ, ఊర్మిళ గజపతికి అవమానం ఎదురైంది. కోటపై నుంచి సుధ, ఊర్మిళను వెళ్లిపోవాలని మాన్సస్ సిబ్బంది చెప్పడం కలకలం రేపింది. దీంతో వారిద్దరూ ఉత్సవం జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో పరోక్షంగా సంచయితపై ఊర్మిళ గజపతి పోస్టులు పెట్టారు. సంచయిత ఆదేశాల మేరకే తమను అవమానించారని ఊర్మిళ వెల్లడిస్తోంది. ఊర్మిళ చేసిన ప్రకటనతో రాజవంశం విబేధాలు రచ్చకెక్కాయి. దీనికి సంబంధించిన వివాదంపై సుధ, ఊర్మిళలు 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు.
కాంట్రవర్సి చేయాలని తనకు ఇష్టం లేదని, తాత, డాడీ వారసత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏదో జరుగుతుందని తాను ముందే ఊహించినట్లు, ఇలా జరగడం తనకు చాలా బాధించిందన్నారు. తాము కోటకు వెళ్లి కూర్చొన్నామని, కొద్ది నిమిషాల తర్వాత..ఈవో వచ్చాడన్నారు. ఇక్కడ కూర్చొవద్దని..ఏమి అనుకోవద్దని చెప్పారన్నారు. దీంతో తాము ఎంతగానో బాధించి..కిందకు వెళ్లిపోవడం జరిగిందన్నారు.
ప్రమాణ స్వీకారం చేసే విషయంలో ఏదో అవుతుందని అనుకోవడం లేదని, తప్పును తప్పుగా చెప్పాలని, తమకు సంబంధం లేదని ఊరుకొంటే..వేరే జరుగుతాయన్నారు. లీగల్ గా తాము ముందుకు వెళుతామని, చేసింది ఒక్క మనిషి అయితే..పొలిటికల్ జోక్యం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మమ్మల్ని కోటపైకి పంపినందుకు సంచయిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిందని సుధ గజపతి రాజు తెలిపారు. వాస్తవాలు చెప్పడమే తమకు తెలుసని, కోటలోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఊర్మిళను ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపారన్నారు.