VH: న్యూఇయర్ వేళ ఆంధ్రకు శుభవార్త.. కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ: వీహెచ్
ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముళ్లలా ఉండాలని, షర్మిలని ఏపీ నేతలు ఆహ్వానిస్తున్నారని..

vh-Sharmila
ఆంధ్రకు శుభవార్త చెబుతున్నానని, కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ… ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే పోరాడాలని తాను గతంలోనే చెప్పానని తెలిపారు.
షర్మిల ఏపీలో బాగా పనిచేస్తారన్న నమ్మకం ఉందని వీహెచ్ చెప్పారు. ఆంధ్రలోనూ కాంగ్రెస్ పార్టీ బలపడాలని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముళ్లలా కలిసి ఉండాలని చెప్పారు. షర్మిలని ఏపీ నేతలు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతోనే ఇక్కడి ప్రజలు తమ పార్టీకి పట్టంకట్టారని చెప్పారు.
ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉందని వీహెచ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ కోసం తాము చాలా కష్టపడ్డామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికి న్యాయం చేస్తారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం అంటూ ఎన్నో హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చలేదని వీహెచ్ చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.
Donthireddy Vemareddy: వాటి గురించి అందరికీ చెప్పే అవసరం లేదు: వేమారెడ్డి