ఆ గొడవతో నాకు సంబంధం లేదు: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: ఆగ్రహంతో వాళ్లు వెంట పడ్డారని తెలిపారు. ముస్తాబాద్ వద్ద వెంకట్రావు కారుని..

ఆ గొడవతో నాకు సంబంధం లేదు: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi

Updated On : May 13, 2024 / 4:37 PM IST

Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లా గన్నవరం బాలుర హైస్కూల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 126వ బూత్ లో తన భార్యతో కలిసి ఓటు వేశారు. గతంలో కంటే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 90 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అన్నారు.

నున్న ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులపై ఒకరు నోరు జారారని వల్లభనేని వంశీ చెప్పారు. దీంతో ఆగ్రహంతో వాళ్లు వెంట పడ్డారని తెలిపారు. ముస్తాబాద్ వద్ద వెంకట్రావు కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసులు వెంకట్రావుని అక్కడ నుంచి పంపించారని చెప్పారు.

అది వెంకట్రావుకు, లోకల్ నాయకులకు మధ్య జరిగిన వివాదమని తెలిపారు. ఆ గొడవతో తనకు సంబంధం లేదని తెలిపారు. కాగా, ఎన్నికల వేళ ఏపీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు.

మోపిదేవి లంకలో వైసీపీ కార్యకర్తలపై దాడి
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని తేజశ్రీ, మోర్ల శీను గాయపడ్డారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. దాడికి దారితీసిన పరిస్థితుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. నెల్లూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట!