Viveka Case: ఆ అజ్ఞాతశక్తి ఎవరు? అందుకే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేదా?: వర్ల రామయ్య

Viveka Case: అవినాశ్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసినప్పటికీ, అవినాశ్ ను అరెస్టు చేయకపోవడంపై వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు.

Viveka Case: ఆ అజ్ఞాతశక్తి ఎవరు? అందుకే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేదా?: వర్ల రామయ్య

Varla Ramaiah

Updated On : May 13, 2023 / 4:19 PM IST

Viveka Case: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి ఎవరు? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. మాజీ మంత్రి వివేకానంద మృతి కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అవినాశ్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసినప్పటికీ అవినాశ్ ను అరెస్టు చేయకపోవడంపై వర్ల రామయ్య ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

“అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోంది? నిన్ హైడ్రిన్ టెస్ట్ పూర్తయితే వివేక రాసినట్టు చెప్పబడుతున్న లేఖపైన అసలు వేలిముద్రలు బయటపడతాయి. ఇంకొంతమంది ముద్దాయిలు వెలుగులోకి వస్తారు. వివేకా కూతురు డాక్టర్ సునీత ఓ వీరవనిత.

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే వివేకాహత్య కేసు ముగిసిపోయినట్టు కాదు. మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది. వెంకటరమణ అనే కావలి డీఎస్పీని వెంటనే అరెస్ట్ చేసి, దిగజారిపోతున్న మీ ప్రభుత్వ ప్రతిష్ఠను కొంతైనా కాపాడుకోండి ముఖ్యమంత్రి జగన్” అని వర్ల రామయ్య అన్నారు.

వివేక మృతి కేసులో ఇప్పటికే సీబీఐ ఎన్నో విషయాలను రాబట్టింది. విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న గంగిరెడ్డి కూడా ఇటీవల నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. అవినాశ్ ను సీబీఐ అధికారులు విచారించారు. ఆయనను అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన అరెస్టు కాకపోవడంతో టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Karnataka Election Results: ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. ఖర్గే కుమారుడు