Vijayasai Reddy: పవన్ కల్యాణ్ కు విజయసాయి కౌంటర్.. విరుచుకుపడుతున్న జనసైనికులు

వారాహి విజయయాత్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు.

Vijayasai Reddy: పవన్ కల్యాణ్ కు విజయసాయి కౌంటర్.. విరుచుకుపడుతున్న జనసైనికులు

vijayasai reddy tweet on pawan kalyan

Updated On : June 15, 2023 / 12:41 PM IST

Vijayasai Reddy – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ హితవు పలికారు. వారాహి విజయయాత్ర (varahi vijaya yatra)లో భాగంగా బుధవారం రాత్రి కత్తిపూడి (Kattipudi)లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కుల రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఒక సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెట్టిందని ఆరోపించారు.

జనసేన అధినేత వ్యాఖ్యలపై ట్విటర్ లో విజయసాయి రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ పేరు పెట్టకుండా ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా ట్వీట్ పెట్టారు. ”కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము – ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. విపక్ష నాయకులు తాము ఫలానా కులానికి చెందినవారమని.. కాబట్టి ఆ కులం వారంతా గంపగుత్తగా తమకే ఓటు వేయాలని మైకులు పట్టుకొని మీద పడుతున్నారు. YSRCP మాత్రం కులం, మతం, వర్గం, పార్టీ, ప్రాంతం చూడదు. అందరినీ సమంగా ఆదరిస్తుందని” విజయసాయి ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్ పై జనసైనికులు ట్విటర్ లో తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

పొత్తు పెట్టుకోం.. ఒంటరిగా పోటీ
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మరో ట్వీట్ లో విజయసాయి స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని పునరుద్ఘాటించారు. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నామని, జనం తమనే ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోటీ చేసినా తాము భయపడబోమని పేర్కొన్నారు. సున్నాతో సున్నా కలిసినా ఫలితం శూన్యమని వ్యాఖ్యానించారు.

Also Read: ఎలా ఆపుతారో చూస్తా.. నేను గొడవపెట్టుకునేది ఎవరితోనో తెలుసా?: పవన్ కల్యాణ్ 

విషం చిమ్ముతున్న విపక్షాలు
ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్ పై ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయని విజయసాయి రెడ్డి మరో ట్వీట్ లో ఆవేదన చెందారు. రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాలు, 24 కోట్ల మందికి ఉపాధి సృష్టించేందుకు సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఇజిఎ, జగనన్న సురక్ష పథకాలతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.

Also Read: పవన్ కల్యాణ్‌కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని.. నీకంటే పెద్ద మగాడిని అంటూ ఘాటు వ్యాఖ్యలు