Shining AP: చంద్రబాబు, పవన్, లోకేశ్ లీడర్‌షిప్‌లో దూసుకుపోతోన్న ఏపీ..

పాలనలో రాజీపడకుండా నిర్ణయాలను ఎగ్జిక్యూట్‌ చేయగల ముక్కుసూటిదనం, ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యంగ్‌ లీడర్‌ నారా లోకేశ్‌.

Shining AP: చంద్రబాబు, పవన్, లోకేశ్ లీడర్‌షిప్‌లో దూసుకుపోతోన్న ఏపీ..

Updated On : June 12, 2025 / 10:27 AM IST

విజనరీ లీడర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యంగ్ అండ్ ఎనర్జిటిక్ మినిస్టర్ నారా లోకేశ్.. ఈ ముగ్గురు నేతల కాంబినేషన్ లో ఏపీ ఎలా ప్రగతి పరుగులు పెడుతోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చాలన్న సంకల్పంతో .. 7 పదుల వయసులోనూ అవిశ్రాంతంగా పనిచేసే ఉత్సాహమున్న విజనరీ లీడర్‌. మరొకరు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. రాజకీయ ఉద్ధండులకు ఏమాత్రం తీసిపోని పదునైన వ్యూహాలు, పక్కా ప్రణాళికతో ప్రజలకు ఏం కావాలో మనసెరిగిన డైనమిక్‌ నాయకుడు. ఇంకొకరు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ లీడర్‌.. మంత్రి నారా లోకేశ్‌. ఈ ముగ్గురు నేతల సమన్వయంలో ఏపీ ఏడాది పాలనను అవలీలగా అధిగమించింది. వినూత్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి పరుగులు పెడుతోంది.

ఎన్నో ఆశలు..ఆకాంక్షలతో ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, పారిశ్రామిక వర్గాలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు కూటమికి బ్రహ్మరథం పట్టారు. వారి ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గకూడదన్న పట్టుదలతో ఈ ముగ్గురు నేతలు సరికొత్త ప్రణాళికలు, వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.

A అంటే అమరావతి, P అంటే పోలవరం
అధికారపీఠమెక్కగానే A అంటే అమరావతి, P అంటే పోలవరం నిర్మాణమంటూ.. ఆ స్వప్నాల్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంపై ఆర్థిక, అప్పుల పెనుభారం ఉన్నా కేంద్రం సహాయ సహకారాలతో సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. నెలనెలా పెన్షన్లు ఠంచనుగా అందిస్తున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లతో పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణకోసం నిరంతరం పరిశ్రమిస్తున్నారు. కేంద్రంతో సత్సంబంధాలను నెరుపుతూ రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తీసుకురావడంలో అపరచాణక్యుడిలా వ్యవహరిస్తున్నారు.

డైనమిక్ లీడర్ పవన్‌ ఏం చేశారు?
సీఎం చంద్రబాబుకు రైట్‌ హ్యాండ్‌లా అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. ఎన్నికల సమయంలో గేమ్‌ చేంజర్‌గా నిలిచి.. కూటమి సర్కార్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలందుకున్న పవన్‌ .. తన డైనమిజంతో తొలిరోజు నుంచే దూసుకెళ్తున్నారు. పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. ఇలా తన పరిధిలో ఉన్న అన్ని శాఖలపై పట్టుపెంచుకుంటూ .. సంచలన నిర్ణయాలతో పవన్‌ పాలనలో తన మార్క్‌ చూపుతున్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ, పంచాయతీరాజ్‌ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, రికార్డు స్థాయిలో గ్రామసభలు, పల్లెపండుగ కార్యక్రమాలు నిర్వహించడం.. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలతో సహా కొత్త రోడ్ల నిర్మాణం..సేద్యపు నీటి కుంటలు తవ్వకం, పకడ్బందీగా ఉపాధి హామీ అమలు,PDS బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు, అటవీ ప్రాంతాల్లో పంటల్ని నాశనం చేస్తున్న ఏనుగులకు కుంకి ఏనుగులతో చెక్‌పెట్టడం, గోకులాల నిర్మాణం, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలవడం.. ఇలాంటి పలు సంచలన నిర్ణయాలతో వెళ్తున్నారు.

యంగ్‌, ఎనర్జిటిక్‌ లీడర్ లోకేశ్ ఏం చేశారు?
ఈ దిగ్గజ ద్వయానికి మరో శక్తిలా తోడయ్యారు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ లీడర్ ఐటీ, సమాచార,విద్య, మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్‌. ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే అమరావతిలో ప్రజాదర్బార్‌ పెట్టి జనం సమస్యల్ని తెలుసుకున్నారు.

అంతేకాదు పాదయాత్రలో తనకు ఎదురైన ప్రజా సమస్యల్ని వాట్సాప్‌ ద్వారా రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌తో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు, పుస్తకాలు, బ్యాగుల పంపిణీ చేయిస్తున్నారు. అలాగే విదేశీ టూర్లు, సదస్సులతో ఏపీకి రిన్యూ వపర్‌, ఎల్జీ లాంటి పెద్ద పరిశ్రమల్ని తీసుకురావడం.. ఇలా యంగ్‌ లీడర్‌గా , మంత్రిగా లోకేశ్‌ చూపిస్తున్న చొరవ.. ఏపీ అడ్మినిస్ట్రేషన్‌లో కీలకంగా మారింది.

ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకొనేలా.. వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు, సుపరిపాలనకోసం ఏడాదిగా ఈ ముగ్గురు నేతలు సమన్వయంతో అలుపెరగకుండా పనిచేస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందు కార్యాచరణ, దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారీ ముగ్గురు నాయకులు.