Weather Updates: ఏపీలో రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. బయటకు రావొద్దు..
వర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు.

Weather Updates: ఏపీలో వానలు కంటిన్యూ అవుతున్నాయి. పలు చోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల ద్రోణి, అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రేపు ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. చెట్ల కింద ఉండరాదని సూచించారు. ఒకవేళ ఇంటి నుంచి బయటకు వచ్చినా.. వాన పడుతున్న సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలన్నారు.
Also Read: గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయం..! ఎందుకీ వివాదం? వైసీపీ వాదన ఏంటి?