YS Jagan: వంశీతోనే అయిపోలేదా? ఇంకా అరెస్టులు ఉంటాయా? జగన్‌ ఆ ఇద్దరి పేర్లను ఎందుకు ప్రస్తావించినట్లు?

మూమెంట్‌ చూసి వంశీని అరెస్ట్ చేసినట్లు ఏ హడావుడి లేని టైమ్‌లో మిగతా వారిని కూడా లోపల ఏస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.

YS Jagan: వంశీతోనే అయిపోలేదా? ఇంకా అరెస్టులు ఉంటాయా? జగన్‌ ఆ ఇద్దరి పేర్లను ఎందుకు ప్రస్తావించినట్లు?

Updated On : February 18, 2025 / 9:07 PM IST

అన్యాయమని వైసీపీ..తగిన శాస్తి జరిగిందని టీడీపీ..విమర్శకు ప్రతి విమర్శలతో వల్లభనేని వంశీ అరెస్ట్ సెంట్రిక్‌గా పొలిటికల్‌ హీట్ పెంచుతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో వైసీపీ అధినేత జగన్‌ విజయవాడ సబ్‌ జైలులో వంశీని ములాఖత్‌ అయి పరామర్శించారు. ఇదంతా ఒక ఎపిసోడ్‌ అయితే..మీడియా అడ్రస్‌ చేస్తున్న క్రమంలో జగన్‌ మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇప్పుడు వంశీని అరెస్ట్‌ చేశారు..రేపోమాపో దేవినేని అవినాశ్‌, కొడాలి నానిని కూడా ఇబ్బందిపెట్టొచ్చన్న ఆయన..దేనికీ భయపడేది లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల కొడాలి నాని, పక్కన పేర్నినాని..ఆ పక్కన దేవినేని అవినాశ్‌ ఆయన వెంటే ఉన్నారు. వంశీని పరామర్శించి..ఆయనపై నమోదైన కేసులు అక్రమమని చెప్పే క్రమంలో జగన్‌ ఎందుకు వీళ్లందరి పేర్లు తీసినట్లు అన్నదే హాట్ టాపిక్ అవుతోంది.

వంశీ అరెస్ట్‌ తర్వాత ఏపీ పాలిటిక్స్‌లో మరోసారి పీక్‌లెవల్‌ హీట్ క్రియేట్ అయింది. ఇక నెక్స్ట్‌ కొడాలి నేని, రోజా, అంబటి రాంబాబు, పేర్నినాని, దేవినేని అవినాశ్‌ లాంటి వాళ్లను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కొందరు టీడీపీ నేతలు అయితే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఓపెన్‌గానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే మాట అంటోంది.

తమ సొంత పార్టీ నేతలు మరికొందరు అరెస్ట్ కావొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. వైసీపీ అధినేత జగన్ కూడా మీడియాకు ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు వంశీ అరెస్ట్ కావొచ్చు..రేపోమాపో కొడాలి నాని, దేవినేని అవినాశ్‌ను కూడా ఇబ్బంది పెట్టొచ్చని..అన్నింటినీ చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు జగన్.

నెక్స్ట్‌ అరెస్ట్‌ వాళ్లదే?
అయితే నెక్స్ట్‌ అరెస్ట్‌ వాళ్లదే అని ప్రచారం జరుగుతున్న వేళ..ఆ ఇద్దరు, ముగ్గురు నేతలు జగన్ వెంట..వంశీ ములాఖత్‌ సందర్భంగా కనిపించడం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అంటే కొడాలి నాని, దేవినేని అవినాశ్, పేర్నినాని కూడా త్వరలో అరెస్ట్ అవుతారని వైసీపీ అధినేత కూడా ఫిక్స్ అయిపోయారా అన్న చర్చ జరుగుతోంది. తమ పార్టీ నేతలు తప్పుచేయలేదని కవర్‌ డ్రైవర్‌ చేసుకుంటున్నప్పటికీ..అసలు మ్యాటరేంటో తెలిసే జగన్‌ అలా మాట్లాడి ఉంటారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.

ఆ ముగ్గురు నేతలు కూడా వంశీ తర్వాత తమ వంతేనని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలు..ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి..అరెస్ట్ చేస్తే చేసుకోమనండి అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం చూస్తుంటే..అరెస్టులకు, కేసులకు ప్రిపేర్‌ అయ్యే మాట్లాడుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది.

ఎలాగూ అరెస్ట్‌ చేస్తారని అలాంటప్పుడు భయపడి దాక్కున్నట్లు కాకుండా జనంలో ఉంటేనే ఎక్కువ మైలేజ్‌ వస్తుందని భావిస్తున్నారట. అంతేకాదు తమ జోలికి రాకముందే వాయిస్ రేజ్‌ చేస్తే ప్రభుత్వం కాస్త బ్యాక్ స్టెప్‌ వేయొచ్చన్న స్కెచ్ కూడా వస్తున్నారట. అందుకే నెక్స్ట్‌ అరెస్ట్ అయ్యేది వాళ్లే అంటూ ప్రచారం జరుగుతున్న నేతలంతా ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా యాక్టీవ్‌ అయినట్లు కనిపిస్తున్నారు. వంశీ ములాఖత్‌ కోసం వెళ్లిన పార్టీ అధినేత జగన్‌ వెంట కనిపించి..తామెక్కడికీ పారిపోలేదని చెప్పే ప్రయత్నం చేశారట.

అయితే జగన్‌ మీడియాను అడ్రస్‌ చేస్తూ కొడాలి నాని, దేవినేని అవినాశ్‌ పేర్లను స్పష్టంగా ప్రస్తావించారు. ఆ ఇద్దరిని కూడా ఇబ్బందిపెట్టొచ్చని జగన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం చూస్తుంటే..వైసీపీ అరెస్ట్‌లకు ప్రిపేర్ అయినట్లే కనిపిస్తోంది. పార్టీ తరఫున లీడర్లకు లీగల్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లైనా అరెస్టయ్యే నేతలకు అండగా నిలవాలని భావిస్తోందట వైసీపీ. అయితే జగన్‌ కామెంట్స్‌పై టీడీపీ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

ఫాల్స్ కేసులు, ప్రజాస్వామ్యం అని మాట్లాడే అర్హత జగన్‌కు, వైసీపీ నేతలకు లేదంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు, లోకేశ్‌ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడిన వంశీని జగన్‌ వెనకేసుకురావడం..పోలీస్‌ అధికారులకు వార్నింగ్‌ ఇవ్వడం జగన్‌కే చెల్లిందంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో లాగా తాము అక్రమంగా నిర్భంధించి..టార్చర్ పెట్టడం లేదని..చట్టప్రకారమే అరెస్టులు, మిగతా ప్రాసెస్ అంతా జరిగిందని అంటున్నారు.

టీడీపీ అధిష్టానం మీద క్యాడర్ ప్రెజర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంశీ, కొడాలి నానిని అరెస్ట్‌ చేయాలంటూ..టీడీపీ అధిష్టానం మీద క్యాడర్ ప్రెజర్ ఉంది. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిపోయింది. ఇక నెక్స్ట్‌ కొడాలి నానినే అంటున్నారు. బయట జరుగుతున్న ప్రచారానికి, టీడీపీ నేతలు చెప్తున్న దానికి బలం చేకూర్చేలా జగన్ కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ కుటుంబాన్ని కొడాలి నాని నోటికొచ్చినట్లు తిట్టారని..వైజాగ్‌ లాంటి ప్లేస్‌లలో ఇప్పటికే ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఇక టీడీపీ ఆఫీస్‌ మీద దాడి కేసులో దేవినేని అవినాశ్‌ కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక పేర్నినాని బియ్యం స్కామ్‌ విషయంలో ఇప్పటికే అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఎవరి అరెస్ట్‌ చేస్తారోనన్న ఆందోళన అయితే వైసీపీలో కనిపిస్తోంది. పైకి మాత్రం నేతలంతా గంభీరంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

వంశీని అరెస్ట్ చేస్తే ఏమైంది..తమను అరెస్ట్ చేస్తే ఏమవుతుందని..భయపడేదేలే అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులపై ప్రభుత్వ పెద్దల అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇదే ఊపులో ఇంకా అరెస్టులు ఉంటాయా లేక..మూమెంట్‌ చూసి వంశీని అరెస్ట్ చేసినట్లు ఏ హడావుడి లేని టైమ్‌లో మిగతా వారిని కూడా లోపల ఏస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.