ప్రియుడిపై మోజు……సెల్ ఫోన్ చార్జర్ తో భర్తను హత్య చేసిన భార్య

  • Published By: murthy ,Published On : October 31, 2020 / 11:03 AM IST
ప్రియుడిపై మోజు……సెల్ ఫోన్ చార్జర్ తో భర్తను హత్య చేసిన భార్య

Updated On : October 31, 2020 / 11:27 AM IST

wife, paramour held for killing husband : అక్రమ సంబంధాల మోజులో పడి బంగారం లాంటి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు కొందరు.  ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను సెల్ ఫోన్ చార్జర్ తో చంపి….. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించాలనుకుంది ఒక ఇల్లాలు.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు కాలేజీ రోడ్డు లో నివాసం ఉంటున్న దూలి రాము(35) అనే వ్యక్తి ఈనెల 26న  చనిపోయాడు. మొదట అందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని భావించారు. కానీ మృతుడి తల్లి లక్ష్మి మాత్రం రామును హత్య చేశారని ఆరోపిస్తూ  పోలీసులకు ఫిర్యాదు చేసింది.



దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో రామును హత్యచేసినట్లు తేలింది. పోలీసులు ఆదిశగా  దర్యాప్తు ప్రారంభించారు. రాము భార్య కుమారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
https://10tv.in/young-wife-killed-by-husband-surrendered-police-station/
పోలీసు విచారణలో అదే గ్రామానికి చెందిన సొండి సతీష్ తో, కుమారికి వివాహేతర సంబంధం ఉన్న విషయం బయట పడింది. సతీష్ ను అదుపులోకి తీసుకున్నపోలీసులు తమదైన  స్టైల్లో విచారించారు. నిందితులు నేరం ఒప్పుకున్నారు.



సతీష్ తో వివాహేతర సంబంధం కొనసాగించటానికి భర్త రాము అడ్డుగా ఉన్నాడని భావించింది కుమారి. ఇదే విషయాన్ని సతీష్ కు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి రామును అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. సెల్ ఫోన్ చార్జర్ వైరుతో రాము మెడకు బిగించి ప్రాణం తీశారు.

ఇంట్లో వారిని,  ఉళ్లో వారిని నమ్మించటానికి మెడకు చున్ని చుట్టి…. ఫ్యాన్ కు  వేలాడ దీసినట్లు అంగీకరించారు. నిందితులిద్దరూ నేరం అంగీకరించటంతో పోలీసులు వీరిని శ్రీకాకుళం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హజరు పరచగా…. న్యాయమూర్తి వీరిని రిమాండ్ కు పంపారు. తండ్రి మరణించటం..తల్లిజైలు పాలవ్వటంతో పిల్లలు శ్రీజ (7) సిధ్దూ (5) ఒంటరి వారయ్యారు.